ఈ కాలంలో యువతలో గుండెపోటు( Heart Attack ) సంఘటనలు గణనీయంగా పెరిగాయి.ఆరోగ్యం బాగా ఉన్నవారు కూడా ఆకస్మికంగా మరణించిన సంఘటనలు తరచూ జరుగుతున్నాయి.
ఈ మరణాలలో ఎక్కువ భాగం గుండెపోటు లేదా గుండె వైఫల్యం కారణంగా సంభవిస్తుంది.తాజాగా రాణిపేటలో( Ranipet ) అలాంటి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
రాణిపేట జిల్లా వాలాజాపేట సమీపంలోని బెల్లియప్ప నగర్‌కు చెందిన చర్మవ్యాధి నిపుణుడు వసంతకుమార్ అతని కుమార్తె ఇషా అద్విత( Isha Advitha ) సుమతంగి ప్రాంతంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.ఉదయం ఇషా అద్విత ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లింది.
ఆపై తరగతి గదిలోనే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడంతో విద్యార్థులు, ఉపాద్యాయులూ కంగారు పడ్డారు.ఘ్తనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు బయటికి వచ్చింది.క్లాస్‌లో టీచర్ పాఠం చెబుతుండగా.విద్యార్థి అద్విత క్లాస్ వింటోంది.దీంతో ఒక్కసారిగా విద్యార్థి అద్విత స్పృహతప్పి పక్కనే ఉన్న విద్యార్థినిపై వాలింది.పక్కనే ఉన్న విద్యార్థికి ఏం జరిగిందో అర్థం కాలేదు.
ఆ తర్వాత విద్యార్థి వెంటనే ఉపాధ్యాయుడిని పిలిచింది.విద్యార్థికి పాఠశాలలో ప్రథమ చికిత్స అందించి వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అక్కడ విద్యార్థినిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న కావేరిపాక్కం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.అలాగే బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు కస్తంపరై ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతుండగా తరగతి గదిలో విద్యార్థి ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయిన ఘటన కలకలం రేపుతోంది.
ఘ్తనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.