సూపర్ స్టార్ రజినీకాంత్( Superstar Rajinikanth ) గురించి మనందరికి తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అంతేకాకుండా ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచారు.ఒక సాధారణ బస్ కండక్టర్( Bus Conductor ) నుండి భారతీయ చలనచిత్రంలో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు రజినీకాంత్.
ఆయన సినీ ప్రయాణం ఎప్పుడూ అంత సులభం కాదు.ఎన్నో అడ్డంకులు, అవమానాలను, కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు.
మరి ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.శివాజురావు రజనీకాంత్ కర్ణాటక, తమిళనాడు సరిహద్దులోని నాచికుప్పం అనే గ్రామానికి వలస వెళ్లిన మరాఠా కుటుంబంలో జన్మించారు.
అనంతరం తమిళనాడులో సెటిల్ అయ్యారు.

రజనీకాంత్ కి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనేది పెద్ద కల.బెంగళూరులోని ఆచార్య అకాడమీ, వివేకానంద బాలక్ సంఘ్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు.సినిమాల్లో నటించాలని చెన్నై వెళ్లాడు.
కానీ అక్కడ ఎలాంటి దొరక్కపోవడంతో రజనీ సినిమాపై ఉన్న మక్కువను వదులుకుని వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.రజనీ కల సినిమా అయితే ఉద్యోగం దొరికితే ఇంటి కష్టాలు తీరుతాయని కుటుంబం భావించింది.
అప్పుడే కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లో బస్ కండక్టర్ గా ఉద్యోగం సంపాదించుకున్నారు రజినీ.అదే సమయంలో నాటకాల్లో నటించేందుకు సమయం దొరికింది.
యాక్టింగ్ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో( Madras Film Institute ) చేరారట.అయితే అప్పుడు కుటుంబం అతడిని ప్రోత్సహించలేదు.
రజనీకాంత్ కె బాలచంద్రన్ దర్శకత్వం వహించి ఆగస్ట్ 18, 1975న విడుదలైన అపూర్వరాగమల్ చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేశారు.

కమల్ హాసన్, శ్రీవిద్య, జయసుధలతో కలిసి నటించారు.కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించాడు.బాలచందర్ నిర్మించిన నేత్రికాన్ రజనీ లక్కీ స్టార్ ను చేసింది.
ఈ సినిమా తర్వాతే తన పేరును శివాజీరావు గైక్వాడ్( ShivajiRao Gaikwad ) నుంచి రజినీకాంత్ గా మార్చారు డైరెక్టర్ బాలచందర్.ఆ తర్వాత దళపతి, మన్నన్, పాండియన్, బాషా, ముత్తు, పడయప్ప, అరుణాచలం సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగాడు.
రజనీకి ప్రత్యామ్నాయం రజనీ ఒక్కరే అని సినీ పరిశ్రమ మొత్తం చెప్పుకునేలా ఇమేజ్ సంపాదించుకున్నారు.అలా ఒక తెలుగు భాషలో మాత్రమే కాకుండా మలయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ భాషలలో నటించారు.2002 ఏడాది రజినీకి కలిసిరాలేదు.వరుసగా ప్లాప్స్ అందుకున్నారు.
దీంతో ఆయన శకం ముగిసిపోయిందని అనుకున్నారు.కానీ ఆ తర్వాత మూడేళ్లకు విడుదలైన చంద్రముఖి( Chandramukhi ) సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస సినిమాలతో అలరిస్తున్నాడు రజినీ.ఇప్పటివరకు ఆయనకి ఎన్నో రకాల అవార్డులు రివార్డులు కూడా లభించాయి.