ప్రస్తుతం టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ ఇష్యూ సంచలనంగా మారింది.ఎక్కడ చూసినా కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు.
ఒకరి తర్వాత ఒకటి మీడియాకు ముందు వస్తున్న విషయం తెలిసిందే.అసలు మంచు ఫ్యామిలీకి ఏమయ్యింది ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాక చాలామంది తలలు పట్టుకుంటున్నారు.
ఇకపోతే తాజాగా మంచు మనోజ్ మీడియాతో ముచ్చటించారు.ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.
నా తండ్రి మోహన్ బాబు( Mohan Babu ) దేవుడు.కానీ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్న తండ్రి నా తండ్రి కాదు.
నా తండ్రి ఇలా ఎప్పుడు ప్రవర్తించరు.కేవలం మా అన్న విష్ణు ( Vishnu )అలాగే మరొక వ్యక్తి వల్ల మాత్రమే నా తండ్రి మోహన్ బాబు ఈ విధంగా దురుసుగా పొగరుగా ప్రవర్తిస్తున్నారు అనే మంచు మనోజ్ ఆరోపించారు.తన తండ్రి భుజాలపై గన్ పెట్టి వాళ్లిద్దరు తనతో పాటు తన భార్యపై పేలుస్తున్నారని మనోజ్ ( Manoj )మండిపడ్డారు.ఈ ఎపిసోడ్ లో నిజానిజాలేంటో సాయంత్రం ఐదున్నర గంటలకు బయట పెడతానని మంచు మనోజ్ అన్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేను చేసిన నేరమా? అని మనోజ్ మీడియా ముందు ప్రశ్నించారు.నా భార్యపై నిందలు వేయడం సమంజసమా? ఇదే తన భార్య తల్లిదండ్రులు అంటే ఊరుకునేవారా అని మంచు మనోజ్ ప్రశ్నించారు.
నా భార్యకు తల్లి తండ్రి అని నేనే, ఆమెకు నేను అండగా ఉంటాను అని తెలిపారు మనోజ్.అలాగే కుటుంబ సభ్యులపై నేను ఎలాంటి దాడికి పాల్పడలేదు అని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ మంచు ఫ్యామిలీ వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఈ గొడవ అంతకంతకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.మరి ఈ గొడవకు ముగింపు ఎప్పుడు పలుకుతారో చూడాలి మరి.