నాన్న చేసిన అతి పెద్ద తప్పు అదే.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు!

మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి .గత మూడు రోజులుగా ఈ గొడవలు ఏమాత్రం సర్దుమనడం లేదు.

 Manchu Vishnu Sensational Comments On Press Meet, Manchu Manoj,vishnu,mohan Babu-TeluguStop.com

అయితే నిన్న రాత్రి మంచు మోహన్ బాబు(Mohan Babu) మీడియా పై దాడి చేయడం సంచలనగా మారింది అనంతరం ఈయన అనారోగ్యానికి గురి కావడంతో కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు.ప్రస్తుతం ఈయన చికిత్స తీసుకుంటున్నారు.

తన కంటి కింద భాగం గాయమైందని తనకు సర్జరీ చేయాలని ఇటీవల వైద్యులు కూడా తన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఈ క్రమంలోనే మా అధ్యక్షుడు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కాంటినెంటల్ హాస్పిటల్ లోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇలా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని అసలు ఊహించలేదని తెలిపారు.ఇలా మా ఫ్యామిలీలో జరగడం చాలా దురదృష్టకరమనే తెలిపారు.

గత మూడు తరాలుగా మేమేంటో మా కుటుంబం ఏంటో అందరికీ తెలుసు మీడియా వారికి మాకి మధ్య ఉన్న అనుబంధం కూడా అందరికీ తెలిసిందే.అయితే కొంతమంది మీడియా ప్రతినిధులు హద్దులు దాటి ప్రవర్తించారని తెలిపారు.

Telugu Journalist, Manchu Manoj, Mohan Babu, Sensational, Vishnu-Movie

ఇక నాన్న అందరికీ నమస్కరిస్తూనే మీడియా ముందుకు వచ్చారు కానీ ఆయన మొహానికి మైకులు అడ్డుపెట్టడంతోనే ఆగ్రహానికి గురై దాడి చేశారని ఇలా అనుకోకుండా ఈ దాడి జరిగిందని తెలిపారు.ఇక నాన్న చేసిన పని బాధాకరమని, రిపోర్టర్ కి గాయాలు కావడం దురదృష్టకరమని తెలిపారు.ఇక మా ఇంట్లో జరుగుతున్న గొడవలు కూడా చాలా చిన్నవి.ఇవి ప్రతి ఒక్క ఇంట్లోనూ జరిగే గొడవలే అని తెలిపారు.కాకపోతే మేము సెలబ్రిటీలు కావడంతో ఇది కాస్త సెన్సేషనల్(Sensational) గా మారిందని ఈ గొడవలు అన్నిటికీ త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.ఇక చిన్నప్పటినుంచి నాన్న చాలా ప్రేమతో అందరిని పెంచారు అదే ఆయన చేసిన తప్పు అంటూ కూడా విష్ణు తెలిపారు.

ఇలా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube