రెబల్స్ చేతుల్లోకి పాలన .. సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు

తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయిన సిరియాలో( Syria) ఉన్న వివిధ దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం(Government of India) అప్రమత్తమైంది.

 75 Indian Nationals Evacuated From Syria As Rebels Overthrow Assad Regime, 75 In-TeluguStop.com

మంగళవారం సిరియా నుంచి 75 మంది పౌరులను భారత్‌కు తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.అసద్ అధికారం కుప్పకూలిన తర్వాత అక్కడ వేగంగా క్షీణిస్తున్న శాంతి భద్రతల నేపథ్యంలో ఈ తరలింపు జరిగింది.

సిరియా నుంచి భారతీయులంతా సురక్షితంగా లెబనాన్ చేరుకున్నారని.అక్కడి నుంచి వాణిజ్య విమానాల (Commercial aircraft)ద్వారా భారతదేశానికి తిరిగి వస్తారని ఎంఈఏ పేర్కొంది.

Telugu Aircraft, India, Jammu Kashmir, Syria-Telugu Top Posts

సైదా జైనాబ్ వద్ద చిక్కుకుపోయిన జమ్మూకాశ్మీర్‌కు(Jammu and Kashmir) చెందిన 44 మంది జైరీన్‌లు భారత్‌కు వస్తున్న వారిలో ఉన్నారు.భారతీయులంతా సురక్షితంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.డమాస్కస్, బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయాలతో విపత్కర పరిస్ధితుల్లోనూ సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేశాయని తెలిపింది.విదేశాల్లోని భారతీయ పౌరుల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

తరలింపు, ఇతర విషయాలపై మరింత సమాచారం కోసం డమాస్కస్‌లోని ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉండాలని భారతీయులను ఎంఈఏ కోరింది.ఇందుకోసం హెల్ప్‌లైన్ నంబర్ (+963 993385973) లేదా ఇమెయిల్ (hoc.

[email protected]) ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు.

Telugu Aircraft, India, Jammu Kashmir, Syria-Telugu Top Posts

కాగా.రెబల్ గ్రూప్ హయత్ తహ్రీ2ర్ అల్ షామ్ (హెచ్‌టీఎస్) డమాస్కస్‌పై నియంత్రణను తెచ్చుకోవడంతో సిరియాలో పరిస్ధితులు వేగంగా మారిపోతున్నాయి.దాదాపు 14 ఏళ్ల బషర్ అల్ అస్సాద్ పాలనతో పాటు ఐదు దశాబ్ధాల అస్సాద్ కుటుంబ ఆధిపత్యానికి సిరియాలో ముగింపు పలికినట్లైంది.ప్రస్తుతం అసద్ దేశం నుంచి పారిపోయి రష్యాలో ఆశ్రయం పొందినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి.

అసద్ తమ దేశంలో సురక్షితంగా ఉన్నట్లు రష్యా కూడా అధికారికంగా ప్రకటించింది.అయితే ఆయన ఎక్కడ ఉన్నారన్నది మాత్రం తెలియరాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube