కమలిని ముఖర్జీ… కలకత్తా లో పుట్టి పెరిగిన కమలిని చిన్నతనం నుంచే నటన అంటే ఇష్టం పెంచుకుంది.అందుకే చదువు అయిపోగానే ముంబైకి చేరింది.
కమలిని తండ్రి ఒక మెరైన్ ఇంజనీర్, తల్లి జువెలరీ డిజైనర్.తనకు మాత్రం డాన్స్ అంటే మహా ఇష్టం.అందుకే హీరోయిన్ అవ్వాలని అనుకుంది.తెలుగు నటి రేవతి ఎయిడ్స్ గురించి తీసిన ఫిర్ మిలెంగే అనే హిందీ సినిమాతో పరిచయం అయింది.2004లో ఈ సినిమా విడుదల అయింది.ఆ తర్వాత శేఖర్ కమ్ముల కమలిని ని చూసి ఆనంద్ సినిమా కోసం అవకాశం ఇచ్చాడు.
ఈ సినిమాకు గాను ఆమె నంది అవార్డును సైతం దక్కించుకుంది.
ఆ తర్వాత ఆనంద్ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తో తెలుగులో అనేక సినిమాల్లో నటించింది.
కేవలం తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ వంటి పరిశ్రమలో పలు సినిమాల్లో నటించింది.తెలుగులో చివరి సారిగా రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించింది కమలిని.
ఆ తర్వాత దాదాపుగా ఆరేళ్లుగా ఆమె ఎక్కడా కనిపించలేదు.ప్రస్తుతం ఏ భాషలోనూ ఆమె సినిమాలు తీయడం లేదు.42 ఏళ్ల కమలిని ముఖర్జీ పెళ్లి చేసుకున్నట్టు కూడా ఎక్కడ వార్తలు లేవు.అయితే కమలిని ఇప్పుడు ఏం చేస్తోంది అనేది తెలుసుకుందాం.
2014లో కెరియర్ ముగుస్తుంది అనుకున్న సమయంలో కమలిని ముఖర్జీ తన ఇద్దరు చెల్లెళ్లతో కలిపి మిర్రర్ మిర్రర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించింది.దీంట్లో అనేక బ్యూటీ వీడియోస్ పోస్ట్ చేయడం ప్రారంభించారు.అనతి కాలంలోనే ఇది బాగానే హిట్ అయింది.దీంతో పాటు ఆమె కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం ప్రారంభించింది.అలాగే బేకరీ బిజినెస్ చేయాలని ఆమె సంకల్పించింది.అంతేకాదు బేకరీ వర్క్స్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం కూడా.
అందుకే ప్రపంచంలో నలుమూలలో ఉన్న అనేక రకాల బేకరీ వంటకాలను చేయడం మొదలుపెట్టింది.ఇలా ప్రస్తుతం సినిమాలకు దూరమై తన ప్రపంచంలో తాను బ్రతుకుతోంది కమలిని ముఖర్జీ.
సెకండ్ ఇన్నింగ్స్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నప్పటికీ ఆమె సింగిల్ గానే ఉంది.