డైలాగ్ కింగ్ మోహన్ బాబు టాలీవుడ్ సీనియర్ నటుడిగా కొనసాగుతున్నారు.అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన మోహన్‌బాబు నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా రాణించారు.
తన 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం గురించి తాజా ఇంటర్వ్యూలో మోహన్‌బాబు వివరించారు.విలన్ అవ్వాలని సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాల తర్వాత దర్శక రత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం నరకం’ సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
తన పేరును భక్తవత్సలం నాయుడు నుంచి మోహన్‌బాబుగా మార్చింది దాసరి నారాయణరావు అని తెలిపారు.తన గురువు దాసరికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నాడు మోహన్ బాబు.
మోహన్ బాబు సొంతూరు మోదుగులపాలెం కాగా, సినీ పరిశ్రమలో అవకాశాల కోసం చెన్నై చేరుకుని అష్టకష్టాలు పడ్డట్లు వివరించాడు.తనకు విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామరావు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి సాయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన్నట్లు గుర్తు చేసుకున్నాడు.ఇకపోతే తనను ఒకరు అత్యంత దారుణంగా అవమానిస్తే నమస్కారం పెట్టి బయటకు వచ్చినట్లు మోహన్‌బాబు తెలిపాడు.
సాధారణంగా మోహన్ బాబు అత్యంత కోపిష్టి అని అందరు అంటుంటారు.కానీ, ఆయన మనసు చాలా మంచిదని సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది పేర్కొంటారు.ఇకపోతే తనకు జరిగిన అవమానం గురించి మోహన్ బాబు వివరించాడు.ఓ ఫిల్మ్‌కు తాను ఆరు నెలలు పని చేస్తే కేవలం రూ.యాభై వేతనంగా ఇచ్చారట.ఇదేంటని అడిగితే అసలు నీ జీవితంలో హైదరాబాద్ చూడగలవా అని అడిగారని, హేళన చేశారని చెప్పాడు మోహన్ బాబు.
అయితే, ఆ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే జరిగిందట.మొత్తంగా ఆయనను అవమానించినప్పటికీ ఏం మాట్లాడకుండా బయటకు వచ్చేశారంటే మోహన్ బాబు మాటలతో కంటే కూడా చేతలతోనే తన స్థాయిని పెంచుకున్నాడని మనం భావించొచ్చు.
ఇకపోతే మోహన్ బాబు నట వారసులుగా ఆయన తనయులు విష్ణు, మనోజ్ సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు.