స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.వరుస విజయాలు బాలయ్య స్థాయిని పెంచగా తర్వాత సినిమాలతో బాలయ్య సంచలనాలు సృష్టించాలని ఫాన్స్ ఫీలవుతున్నారు.
బాలయ్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అఖంఢ అనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సీక్వెల్ గా అఖంఢ2 తెరకెక్కుతోంది.ఒకింత భారీ బడ్జెట్ తో అఖంఢ2 తెరకెక్కుతుంఢగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అఖంఢ2(Akhanda 2) సినిమాలో సైతం ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ఒక హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా దసరా పండగ కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది.దసరా పండుగ కానుకగా నందమూరి హీరోలు నటించి విడుదలైన సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ అయ్యాయి.
బాలయ్య భగవంత్ కేసరి, ఎన్టీఆర్ దేవర (Balayya Bhagwant Kesari, NTR Devara)సినిమాలు దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

దసరా సెంటిమెంట్ ను బాలయ్య (/Balayya)రిపీట్ చేస్తూ తర్వాత సినిమాల విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బాలయ్య తన కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.సంక్రాంతి(Sankranti) కానుకగా డాకు మహారాజ్(Daku Maharaj) ను రిలీజ్ చేస్తున్న బాలయ్య దసరా కానుకగా మరో సినిమాను రిలీజ్ చేస్తే సంచలనం అవుతుంది.
అయితే బోయపాటి శ్రీను నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తారనే టాక్ ఉంది.