సావిత్రి ఎంత గంబీజీరమైన పాత్రలు చేసిన కూడా ఆమె నిజజీవితంలో మాత్రం ఒక అల్లరి పిల్ల.షూటింగ్ లొకేషన్ లో ఆమె అల్లరి భరించడం చాల కష్టం.
కానీ ఒక్కసారి కెమెరా ఆన్ అయితే మాత్రమే ఆమెలో నటన విశ్వరూపం చూపిస్తుంది.షూటింగ్ లొకేషన్ లో సావిత్రి ఉంది అంటే చాలు అక్కడ ఒక సందడి వాతారవరణం ఉండేది.
అందరిని ఆట పట్టిస్తూ, అల్లరి చేస్తూ సావిత్రి చిన్న పిల్లల మారిపోయి తనతో ఉన్నవారిని కూడా కడుపుబ్బా నవ్వేలా జోకులు వేస్తూ ఉంటుంది.అంత నవ్వించడం వల్లనే అనుకుంట ఆమె జీవితం అంతకుడా విషాదం తో నిండిపోయింది.
ఆమె నవ్వును అందుకే ఆ దేవుడు ఎత్తుకెళ్లిపోయాడు.
ఇక అసలు విషయంలో కి వస్తే నటుడు జగ్గయ్య తన సొంత నిర్మాణం లో సినిమాలు తీశారు.
బయట వారి సినిమా అంటే టైం కి మేకప్ తో పాటు ఉండే జగ్గయ్య అయన సొంత సినిమా విషయానికి వచ్చే సరికి లొకేషన్ కి వచ్చి నిద్రపోయేవారట.జగ్గయ్య మరియు విజయ నిర్మల హీరో హీరోయిన్స్ గా సినిమాలో సావిత్రి కూడా ఒక మైఖ్యమైన పాత్రలో నటించింది.
ఓ రోజు సినిమా షూటింగ్ జరుగుతన్న సమయంలో జగ్గయ్య గారు హాయిగా వెళ్లి పడుకున్నారట.ఆ రోజు కొన్ని ముఖ్యమైన సీన్స్ షూట్ చేయాలనీ ప్లాన్ చేసుకున్నారట.
అయితే ప్రొడ్యూసర్ అయినా జగ్గయ్య ఒక వైపు నిద్ర పోయారు.అందరు అయన కోసం ఎదురు చూస్తున్నారు.
ఆయన్ను నిద్ర లేపే సాహసం ఎవరు చేయలేకపోయారు.ఎందుకంటే జగ్గయ్య కు నిద్ర లో లేపితే తన్నేస్తారు.అంత కోపం వస్తుంది ఆయనకు.కానీ నిద్ర లేపకపోతే షూటింగ్ చెడిపోతుంది.ఏం చేయాలో అర్ధం కానీ పరిష్టితి.అంతలో సావిత్రి రంగ ప్రవేశం చేసి జగ్గయ్యను నిద్ర లేపడానికి ఒక చిన్న పుల్ల పట్టుకొని వెళ్ళింది.
అయన చెవులో ఆ పిల్లతో తిప్పి ఆయనకు మెలకువ వచ్చేలోపు అక్కడ నుంచి పారిపోయింది.ఎవరు నిద్ర లేపరో కూడా జగ్గయ్య చూడలేదు.
అయన కోపంగా నిద్ర లేవడం చూసి అందరు నిశ్శబ్దంగా ఉండిపోయారు.ఎవరికీ వారు తాము కాదు అన్నట్టుగా మొహాలు పెట్టారు .ఇక చేసేదేం లేక మేకప్ రూమ్ కి వెళ్ళిపోయి సీన్ కి రెడీ అయ్యి వచ్చారు జగ్గయ్య.ఆలా ఉంటుంది మన నాటి సావిత్రమ్మ తో.