దంపుడు బియ్యం ఆరోగ్యం ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు నమ్మలేరు..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.దీనికి కారణం ఏమిటంటే ఈ రోజులలో చాలా కుటుంబాలు బయటి ఆహారాన్ని తినడం, జంక్ ఫుడ్( Junk Food ) ఎక్కువగా తీసుకోవడం లాంటి పనులు చేస్తున్నారు.

 Health Benefits Of Unpolished Rice,unpolished Rice,blood Pressure,brown Rice,whi-TeluguStop.com

కానీ పూర్వం రోజులలో ప్రజలు ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యాన్ని తినేవారు కాదని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఎందుకంటే వారు ఎక్కువగా దంపుడు బియ్యం అన్నం వండడానికి ఉపయోగించేవారు.

ఎందుకంటే దంపుడు బియ్యం( Unpolished rice ) లో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఇంకా చెప్పాలంటే దంపుడు బియ్యం లో ఉండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముడి బియ్యం లో వరిపొట్టు కింద బియ్యం పైన ఉండే తవుడు పొరలలో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే వారానికి ఐదు కంటే ఎక్కువసార్లు తెల్ల బియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి( Diabetes ) ముప్పు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే దంపుడు బియ్యం లో రక్తపోటు పెరగడానికి( Blood Pressure ) కారణమయ్యే సోడియం తక్కువగా ఉంటుంది.మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కీలకపాత్ర పోషించే నియాసిన్, విటమిన్ B3 దంపుడు బియ్యం లో ఎక్కువగా ఉంటాయి.దంపుడు బియ్యం తినేవారిలో గుండె సమస్యలు రావని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా ఇవి అడ్డుకుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.దంపుడు బియ్యం లోని పిండి పదార్థాలు నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి అంత త్వరగా పెరగదు.

ఇంకా చెప్పాలంటే బ్రౌన్ రైస్( Brown Rice ) లో పీచు పదార్థం ఎక్కువ గా ఉండడంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube