శీతాకాలం( Winter Season ) ప్రారంభమైంది.ఈ చల్లని వాతావరణంలో ఊపిరితిత్తులకు కఫం త్వరగా పట్టేస్తుంది.
ఈ కఫం కారణంగా కొందరు తీవ్రమైన దగ్గుతో బాధపడుతుంటారు.దగ్గుకు తోడు గొంతులో ఇబ్బంది, ఆయాసం వంటి సమస్యలు కూడా వేధిస్తుంటాయి.
ఈ క్రమంలోనే కఫాన్ని కరిగించుకొని దగ్గు సమస్య( Cough ) నుంచి బయటపడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి.
ఈ చిట్కాలను పాటిస్తే రెండు రోజుల్లో రిలీఫ్ లభిస్తుంది.మరి ఇంకెందుకు లేటు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
కఫాన్ని విరిచేయడానికి మిరియాలు అద్భుతంగా సహాయపడతాయి.

పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి( Pepper Powder )లో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి నేరుగా తీసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తే కఫం కరిగిపోతుంది.దగ్గు సమస్య దూరం అవుతుంది.
అలాగే కఫాన్ని కరిగించి దగ్గుకు చెక్ పెట్టడానికి అతి మధురం సహాయపడుతుంది.అందుకోసం వన్ టేబుల్ స్పూన్ అతి మధురం చూర్ణం( Athimadhuram )లో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి తినాలి.
ఇలా కనుక చేస్తే కఫం పడిపోయే దగ్గు సమస్య పరార్ అవుతుంది.

ఫూల్ మఖానా. వీటిని చాలా మంది స్నాక్స్ గా తింటూ ఉంటారు.అయితే దగ్గు తగ్గించడానికి కూడా మఖానాను ఉపయోగించవచ్చు.
వన్ టేబుల్ స్పూన్ మఖానా పొడికి వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి తీసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే దగ్గు సమస్య తగ్గుతుంది.
ఇక రెండు చిటికెల లవంగాల పొడికి పావు టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడి.కొంచెం తేనె కలిపి తీసుకున్న కూడా కఫం కలిగి దగ్గు సమస్య దూరం అవుతుంది.
కాబట్టి కఫం పట్టేసి దగ్గు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.