మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కాలేయం.సమస్త శరీరానికి.
మిగతా అవయవాలకి శక్తిని ఇచ్చే సామర్ధ్యం ఈ కాలేయాన్ని మాత్రమే ఉంది.శరీరంలో ఇది చేసే ముఖ్యమైన పనులు శక్తిని నిల్వ చేయడం, అవసరం ఉన్నప్పుడు వాడటం, హార్మోన్లను కంట్రోల్ చేయడం, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం.
అంతేకాదు శరీరంలో ఉండే హానికర పదార్ధాలని కాలేయం బయటకి పంపివేస్తుంది.ఒక రకంగా చెప్పాలి అంటే లివర్ సరిగా పనిచేయకుండా మనిషి బ్రతకడం అంటే చాలా కష్టం.
మద్యం సేవించినపుడు,పొగాకు కాల్చినపుడు వాటి ప్రభావం కాలేయం మీద పడుతుంది.అందుకే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన కాలేయ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
అసలు కాలేయానికి ముప్పు ఉందని గుర్తించడం చాల తేలిక.ఈ మార్పులు కనుక మీ శరీరంలో జరుగుతున్నట్లు గుర్తించినట్లైతే.తప్పకుండా మీ కాలేయం పాడవుతొంది అని తెలుసుకోండి.
కామెర్లు బారినపడటం, చర్మ సమస్యలు ఉండటం నిస్సత్తువ ఆవరించడం, శరీరంలో కొలెస్ట్రాల్ ఉండటం , తీవ్రమైన అలసటగా ఉండటం, రక్తం గడ్డ కట్టడం, ఆకలి లేకపోవడం, కాళ్లు, చేతులు వాయడం, వంటి లక్షణాలు కనిపించినట్టయితే మీ కాలేయం ప్రమాదంలో ఉన్నట్టే.
వెంటనే వైద్యుడిని సంప్రదించండి.