భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు విశేష గుర్తింపు ఉన్న విష్యం తెలిసిందే.ముఖ్యంగా 90లలో ఆయన చేసిన సినిమాల హంగామా అంతా ఇంతా కాదు.
కన్యాదానం, రా, A, ఉపేంద్ర, రక్త కన్నీరు (Kanyadanam, Raw, A, Upendra, Rakta Kanniru)వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి.విభిన్నమైన కథలను ఎంచుకొని సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్(Upendra Style).
అప్పట్లో, ఆయన సినిమాలు విడుదల కావడం అంటే కర్నాటకలో థియేటర్స్ వద్ద జాతరలా అనిపించేది.ఇప్పటి కూడా అక్కడ అలాగే ఉందనుకోండి.
అది వేరే విషయం.కానీ గత కొన్నేళ్లుగా తన సొంత దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి, కేవలం హీరోగా మాత్రమే ఉపేంద్ర సినిమాలు చేస్తున్నాడు.

ఇకపోతే, గతేడాది “కబ్జా” అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.అయితే, ఎన్నో ఏళ్ల తర్వాత తన స్వీయ దర్శకత్వంలో ‘యూఐ’ (UI) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా డిసెంబర్ 20న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.
కొద్ది రోజుల క్రితం ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఉపేంద్ర, ‘యూఐ’ సినిమాతో సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు ఈ సినిమాకి క్లైమాక్స్ కూడా మీరు ఊహించిన దానికంటే కొత్తగా ఉంటుందని చెప్పారు.కన్నడ(Kannada) సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో, ‘యూఐ’ సినిమా కూడా మంచి కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.‘యూఐ’ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ, టాలీవుడ్‌లో ఉపేంద్రకు ఉన్న ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కారణంగా, ఈ సినిమా బుకింగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమాతో మరోసారి వింటేజ్ ఉపేంద్ర దర్శకత్వాన్ని చూడబోతున్నామని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.