దారుణం: గ్రైండర్‌లో చొక్కా ఇరుక్కుపోవడంతో 19 ఏళ్ల యువకుడు మృతి!

అవును, మీరు విన్నది నిజమే.గ్రైండర్‌లో (Grinder)చొక్కా ఇరుక్కుపోవడంతో 19 ఏళ్ల యువకుడు అత్యంత దారుణంగా మృతి చెందాడు.

 19-year-old Dies After Shirt Gets Stuck In Grinder!, 19-year-old, Youth ,dies, S-TeluguStop.com

ముంబైలో జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసినట్టు తెలుస్తోంది.బాధితుడు ఆహారాన్ని తయారు చేస్తుండగా గ్రైండర్ యంత్రం అతడిని తనలోకి లాగేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో క్షణాల్లో దారుణం జరిగిపోయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.అసలు విషయంలోకి వెళితే… బాధితుడు, 19 ఏళ్ల సూరజ్ నారాయణ్ యాదవ్(19-year-old Suraj Narayan Yadav), ఓ జార్ఖండ్(Jharkhand) నివాసి.

ఇతను తాజాగా వర్లీలోని రోడ్డు పక్కన చైనీస్ ఫుడ్ స్టాల్‌లో పనికి కుదిరాడు.ఈ క్రమంలో టిఫిన్ తయారు చేయడం కోసం పిండిని గ్రైండర్‌లో వేసే క్రమంలోనే ఈ దారుణం జరిగినట్టు సమాచారం.

19 ఏళ్ల సూరజ్ నారాయణ్ యాదవ్ (Suraj Narayan Yadav)మంచూరియన్ మరియు చైనీస్ భెల్ కోసం ముడిసరుకును సిద్ధం చేయడానికి, అదేవిధంగా టిఫిన్ సెక్షన్ కోసం అక్కడ పనికి కుదిరినట్టు దర్యాప్తులో తెలిసింది.ఈ క్రమంలోనే అతను గ్రైండర్‌ ఆన్ చేయగా అనూహ్యంగా అది మొదట అతని చొక్కాను తనలోకి లాక్కొని ఆ తరువాత అతగాడిని పూర్తిగా తనలోకి లాక్కొని అతని శరీరాన్ని నుజ్జునుజ్జు కింద చేసిందని వినికిడి.యాదవ్ గ్రైండర్ యంత్రాన్ని(Yadav grinder machine) నడుపుతున్నప్పుడు సీసీటీవీలో ఈ సంఘటన మొత్తం రికార్డైన కారణంగా స్టాల్ యజమాని సచిన్ కొతేకర్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.

ఎందుకంటే, అతనికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండానే ఆ పనిలో అతనిని కుదుర్చుకున్నందుకు గాను యజమానిపైన కేసు నమోదు అయ్యింది.ఆ ఫలితంగానే చొక్కా గ్రైండర్ మెషిన్‌లో ఇరుక్కుపోయింది అని పోలీసులు నిర్దారించారు.ఈ క్రమంలో అతని నడుము చేతులు, కాళ్ళు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పుకొస్తున్నారు.

క్షణాల్లోనే ఆ దారుణం అక్కడ జరిగిపోయింది.అటువంటి పరికరాలను నిర్వహించడంలో యాదవ్‌కు ముందస్తు అనుభవం లేదా సాంకేతిక పరిజ్ఞానం లేదని పోలీసులు నివేదించారు.

అందుకే కోతేకర్ తనకు సరైన భద్రతా చర్యలు లేదా శిక్షణ ఇవ్వకుండా ఉద్యోగం ఇచ్చాడని ఆరోపించారు.కాగా వైరల్ అవుతున్న ఫుటేజ్ చూసి జనాలు భయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube