వర్షాల్లో తరచూ తడవటం వల్ల బాడీ దురదగా, మంటగా ఉందా.. అయితే ఈ హెర్బల్ బాత్ పౌడర్ మీకోసమే!

ప్రస్తుతం వర్షాకాలం( Monsoon ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సీజన్ లో అంటువ్యాధులు, విష జ్వరాలు విపరీతంగా విజృంభిస్తుంటాయి.

 Best Bath Powder For Healthy Skin During Monsoon Details! Herbal Bath Powder, Ba-TeluguStop.com

అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.ముఖ్యంగా కొందరికి వర్షాల్లో తరచూ తడవటం వల్ల బాడీ మొత్తం దురదగా, మంటగా ఉంటుంది.

ర్యాషెస్( Skin Rashes ) కూడా వస్తుంటాయి.మీరు కూడా ఈ సమస్యల‌ను ఫేస్ చేస్తున్నారా.? అయితే అస్స‌లు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ బాత్ పౌడర్ ను వాడితే ఆయా సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెర్బల్ బాత్ పౌడర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి( Besan Flour ) వేసుకోవాలి.

అలాగే మూడు టేబుల్ స్పూన్లు రోజ్‌ పెటల్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, మూడు టేబుల్ స్పూన్లు వేపాకు పౌడర్, వన్ టేబుల్ స్పూన్ వట్టివేరు పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Bath Powder, Besan, Tips, Healthy Skin, Latest, Monsoon, Neem Powder, Ski

తద్వారా మన హెర్బల్ బాత్ పౌడర్( Herbal Bath Powder ) సిద్ధమవుతుంది.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.ఈ పౌడర్ ను బాడీ మొత్తానికి పట్టించి రెండు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వేళ్ళతో సున్నితంగా రబ్‌ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ హెర్బల్ బాత్ పౌడర్ ను రోజుకు ఒకసారైనా ఉపయోగించాలి.

Telugu Bath Powder, Besan, Tips, Healthy Skin, Latest, Monsoon, Neem Powder, Ski

ఈ హెర్బల్ బాత్ పౌడర్ దురద, మంట వంటి వాటికి చెక్ పెడుతుంది.ర్యాషెస్ ఏమైనా ఉంటే వాటిని నివారిస్తుంది.అదే సమయంలో చ‌ర్మంపై పేరుకుపోయిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది.స్కిన్ ను హెల్తీగా, షైనీ గా మారుస్తుంది.కాబట్టి ప్రస్తుత వర్షాకాలంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావించేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా హెర్బల్ బాత్ పౌడర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube