ఓపెన్ పోర్స్. చాలా మందిని కలవరపాటుకు గురిచేసే చర్మ సమస్య ఇది.
ఎలాంటి చర్మతత్వం వారినైనా ఈ సమస్య వేధిస్తుంది.ఓపెన్ పోర్స్ వల్ల ముఖం అందవిహీనంగా, డల్‌గా కనిపించమే కాదు.
మొటిమలు, ముదురు రంగు మచ్చలు వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.అందుకే ఈ సమస్యను వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఖరీదైన క్రీమ్స్ వాడుతుంటారు.కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే సులభంగా ఓపెన్ పోర్స్‌ను క్లోజ్ చేసుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్‌ను వేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఎగ్ వైట్‌లో వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసి స్పోర్క్ సాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రెష్ తో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే ఓపెన్ పోర్స్ క్రమంగా క్లోజ్ అవుతుంది.

అలాగే ఒక టమోటాను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను బ్లెండ్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు టమాటా జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, రెండు చుక్కల లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఓ అర గంట పాటు వదిలేయాలి.
ఆపై వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.