టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ అండ్ యంగ్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ ఏడాది ఈయన హనుమాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో ప్రశాంత్ వర్మ పేరు మారు మోగిపోయింది.
ఈ క్రమంలోనే తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎదురు చూస్తున్నటువంటి బాలకృష్ణ (Balakrishna) ఆ బాధ్యతను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారు.

ఇలా ప్రశాంత్ వర్మ(prashanth varma) అద్భుతమైన కథను సిద్ధం చేయడమే కాకుండా మోక్షజ్ఞ(Mokshagna) కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు డిసెంబర్ ఐదో తేదీ ఎంతో ఘనంగా జరగబోతున్నాయని అందరూ భావించారు అందుకు తగ్గట్టు ఏర్పాటు కూడా చేయడమే కాకుండా సినిమా సెలబ్రిటీలు అందరిని కూడా ఆహ్వానించారు కానీ ఉన్నఫలంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి దీంతో ఈ సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా ఈ సినిమా ఆగిపోవడానికి కారణం లేకపోలేదు ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడగడమే కాకుండా సినిమా లాభాలలో వాటా అడిగారట అందుకు ఒప్పుకోకపోవడంతో తన అసిస్టెంట్ ఈ సినిమాకి దర్శకుడుగా పని చేస్తారని చెప్పడంతో బాలయ్య ప్రశాంత్ వర్మపై (Balayya Prashanth Varma)ఆగ్రహం వ్యక్తం చేశారని అందుకే ఈ సినిమా ఆగిపోయింది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలన్నింటినీ ఖండిస్తూ మేకర్స్ ఒక లెటర్ విడుదల చేశారు.మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.
సరైన సమయంలో ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ వస్తాయి.ఆ సమాచారం అభిమానులతో పంచుకుంటాము.
అంత వరకు దయచేసి నిరాధార కథనాలు ప్రచారం చేయవద్దనీ క్లారిటీ ఇచ్చారు.దీంతో ఈ వార్తలకు చెక్ పడినట్టు అయింది.