వాటర్ బాటిల్ బిల్ ధర 100 రూపాయిలు... జొమాటోపై ఫైర్ అవుతున్న జనాలు!

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? వాటర్ బాటిల్ (Water bottle)ధర 100 రూపాయిలు ఏమిటని కంగారు పడుతున్నారా? అందులో ఏమైనా స్పెషల్ మినరల్స్ యాడ్ చేసారేమోనని అనుమానం పడుతున్నారా? ఆగండాగండి… పూర్తి కధ వింటే మీరు అవాక్కవుతారు.అవును, సాధారణంగా కమర్షియల్ ప్లేసుల్లో(commercial places), లేదంటే ఎక్కువగా జనావాసం లేని ప్రాంతాలలో అయితే వ్యాపారులు నిర్ణీత ధరకు మించి అమ్మడం చాలా సహజం.అలాంటి చోట్ల రూ.10 విలువ చేసే వాటర్ బాటిల్ లేదంటే బిస్కెట్ ప్యాకెట్లను(Biscuit packets) రూ.15 లేదంటే అంతకంటే ఎక్కువగా అమ్ముతారు.కానీ ఆ ధర రూ.20కి మించదు.కానీ, తాజాగా ఓ ఈవెంట్లో జొమాటో(Zomato) సంస్థ రూ.10 విలువ చేసే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ను ఏకంగా రూ.100 రూపాయలకు అమ్మి, తీవ్ర విమర్శలను మూటకట్టుకుంది.

 Water Bottle Bill Costs Rs 100... People Are Firing At Zomato!, Water Bottle, B-TeluguStop.com

అవును, దాంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు జోమాటో (Zomato)సంస్థపై ఫైర్ అవుతున్నారు.దాంతో ఈ వ్యవహారంపై జొమాటో కంపెనీ కూడా తాజాగా రియాక్ట్ అయ్యింది.విషయంలోకి వెళితే… తాజాగా ‘ఈవా లైవ్’ అనే సంస్థ ఓ మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించగా ఆ వేడుకకి పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యారు.కాగా ఈ ఈవెంట్ కు జొమాటో టికెటింగ్ పార్ట్ నర్ గా ఉండడం కొసమెరుపు.

అదే ఈవెంట్ లో జొమాటో సంస్థ ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి, వాటర్ బాటిళ్లు, ఫుడ్ అమ్మకాలు వంటివి చేపట్టింది.

Telugu Rupees, Zomato, Bottle, Bottle Rs-Latest News - Telugu

ఈ క్రమంలోనే రూ.10 విలువ చేసే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్(Half liter water bottle), ఏకంగా రూ.100కు అమ్మడం జరిగింది.దాంతో ఓ టెక్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… “ఈ మ్యూజికల్ ఈవెంట్ కి వెళ్లిన వారికి సొంత వాటర్ బాటిళ్లు తెచ్చుకునేందుకు నిర్వాహకులు అనుమతించలేదు.కచేరీ ప్రాంగణంలో రూ.10 విలువ చేసే వాటర్ బాటిళ్లను రూ.100కు అమ్ముకొని వ్యాపారం చేసారు.ఇంత ధరకు అమ్మడానికి జొమాటోకు ఎవరు అనుమతించారు?” అని పల్లబ్ డే అనే టెక్కీ ప్రశ్నించాడు.అంతేకాకుండా తన దగ్గర రెండు హాఫ్ లీటర్ వాటర్ బాటిళ్లకు ఏకంగా రూ.200 వసూళు చేశారంటూ ఫోన్ పే చేసిన స్క్రీన్ షాట్ తో పాటు వాటర్ బాటిళ్లు అమ్మే స్టాల్ ఫోటోలను కూడా అతగాడు షేర్ చేశాడు.దాంతో ఈ విషయం వెలుగు చూసింది.

Telugu Rupees, Zomato, Bottle, Bottle Rs-Latest News - Telugu

కట్ చేస్తే, ఈ పోస్టుని తెలంగాణ హైకోర్టు న్యాయవాదికి ట్యాగ్ చేశాడు సదరు వ్యక్తి.ఈ క్రమంలోనే అతను పెట్టిన పోస్టుపై జొమాటో స్పందించింది.“హాయ్ పల్లబ్(Hi Pallab), మీకు జరిగిన ఇబ్బందికి క్షమాపణలు.

మేం ఈవెంట్ ఆర్గనైజర్లం అయితే కాదు.కేవలం టికెటింగ్ భాగస్వాములం మాత్రమే.

మా సొంత ఈవెంట్లు జరిగినప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం” అని రాసుకొచ్చింది.కాగా జొమాటో వ్యవహారంపై నెటిజన్లు ఉపేక్షించడంలేదు.

కామెంట్లతో రెచ్చిపోతున్నారు.ఈ క్రమంలోనే ఓ నెటిజన్ “జొమాటో తీరు హేయనీయం.

వినియోగదారులను దారుణంగా దోపిడీ చేస్తోంది.ఈ సంస్థకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు గళం విప్పాల్సిన అవసరం ఉంది!” అని స్పందించారు.

మరో నెటిజన్ స్పందిస్తూ… “వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయండి.జనాలను పీడిస్తున్న జొమాటోకు తగిన బుద్ధి చెప్పండి.!” అని కామెంట్ పెట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube