ప్రతి ఏడాది బుద్ధ పౌర్ణమి ( Buddha full moon )పండుగను వైశాఖ మాసం పౌర్ణమి రోజు జరుపుకుంటారు.ఈ సంవత్సరం బుద్ధ పౌర్ణమి పండుగను మే నెల 5వ తేదీన జరుపుకుంటారు.
ఈ రోజున గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ఊరేగింపులు, భజనలు, విరాళాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు.ఈ సారి బుద్ధ పౌర్ణమి చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు.
ఎందుకంటే ఈ రోజున అలాంటి కొన్ని ప్రత్యేకమైన యాదృచ్చికాలు జరుగుతున్నాయి.ఈ రోజున మీకు రెట్టింపు ఫలాలు లభిస్తాయి.
అంతేకాకుండా ఈరోజున కుర్మ జయంతి కూడా జరుపుకుంటారు.పురాణాల ప్రకారం ఇది శ్రీహరి విష్ణువు ( Srihari Vishnu )9వ అవతారం అని పండితులు చెబుతున్నారు.
కాబట్టి ఈ రోజు బుద్ధ పౌర్ణమి రోజున శుభ యోగ, శుభ సమయం, నివారణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మే నాల్గవ తేదీ ఉదయం 11:44 నుంచి మే 5వ తేదీ రాత్రి 11 గంటల మూడు నిమిషాల వరకు బుద్ధ పౌర్ణమి శుభ సమయం ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే ఉదయం ఏడు గంటల 18 నిమిషముల నుంచి 8.58 నిమిషముల వరకు సత్యన్నారాయణుని ఆరాధనకు శుభ సమయం ఉంటుంది.అలాగే సాయంత్రం 6 గంటల వరకు చంద్రోదయానికి అర్ఘ్యం సమర్పించే సమయం ఉంటుంది.దీనివల్ల మనిషికి కూడా శీఘ్ర పలితాలు వస్తాయి.మనిషి జీవితంలో డబ్బుకు అసలు లోటు ఉండదు.అదే సమయంలో బుద్ధ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడింది.
అయితే ఈ ప్రభావం మన దేశంలో కనిపించదు.సిద్ధయోగం మే 4వ తేదీన ఉదయం 10:37 నుంచి మే 5వ తేదీ 9.17 నిమిషముల వరకు ఉంటుంది.చంద్రగ్రహణం మే 5వ తేదీ రాత్రి 8 గంటల 45 నిమిషముల నుంచి ఒకటి వరకు ఉంటుంది.
మీ పని ఏదైనా చాలా కాలంగా ఆగిపోయినట్లయితే బుద్ధ పౌర్ణమి రోజు శుభ సమయంలో పవిత్ర నదిలో స్నానం చేయాలి.అది చాలా మంచిది.ఇలా చేయడం ద్వారా వ్యక్తి అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడు.అలాగే ఇంట్లో గంగాజలం చల్లడం వల్ల ప్రతికూలత దూరమవుతుంది.
అలాగే బుద్ధ పౌర్ణమి రోజు వెండి పళ్లెంలో నెయ్యి దీపం వెలిగించాలి.అందులో కాయలు, ఎండు ఖర్జూరాలు ఉంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి.
ఈరోజు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లి నల్ల నువ్వులు కలిపిన నీళ్లను పిడికెడు తీసుకుని పూర్వీకుల పేరుట సమర్పించాలి.ఇలా చేయడం వల్ల వైషమ్యాలు, అశాంతి దూరమైపోతాయి.