అఖిల్ బ్యాచిలర్.. సూపర్ అనేసిన చరణ్..!

అక్కినేని యువ హీరో అఖిల్ లీడ్ రోల్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్.ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు.సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే నటించింది.దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా దసరా సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచింది.అంతేకాదు అఖిల్ ఖాతాలో మొదటి కమర్షియల్ హిట్ వచ్చేలా చేసింది.సినిమా వసూళ్లు కూడా బాగున్నాయి.

 Ram Charan Praises To Akhil Bachelor Movie, Most Eligible Bachelor, Akhil, Pooja-TeluguStop.com

ఇక ఈ సినిమా చూసిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ అఖిల్ సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

తమ్ముడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ అందుకోవడం సంతోషంగా ఉందని.

సినిమాలో నీ నటనకు ఫిదా అయ్యాను.పూజా హెగ్దే మరోసారి నీ పాత్రకు నువ్వు న్యాయం చేశావు.

పాత్రలో జీవించావు.బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాణ సంస్థకు శుభాకాంక్షలు అంటూ చరణ్ ట్వీట్ చేశారు.

అంతేకాదు ఇదే మెసేజ్ ఇన్ స్టాగ్రాం స్టోరీస్ లో కూడా పెట్టుకున్నాడు చరణ్.చరణ్ ట్వీట్ తో బ్యాచిలర్ సినిమాకు మరింత బూస్టింగ్ వచ్చినట్టే అని చెప్పొచ్చు.

కెరియర్ లో మొదటి సూపర్ హిట్ కొట్టిన అఖిల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube