ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు( Bhujangarao, Tirupattana ) కోర్టు కస్టడీ విధించింది.ఈ మేరకు ఇద్దరిని ఐదు రోజులపాటు నాంపల్లి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది.
అదేవిధంగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ కోసం వేసిన పోలీసుల పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.కాగా ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్ గూడ జైలులో ఉన్నారు.
కాగా ఇదే కేసులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఇన్ స్పెక్టర్ గట్టుమల్లును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.వీరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక అధికారుల బృందం విచారిస్తుంది.