ఒకే రకానికి చెందిన కూరగాయల్లో రకరకాల రంగులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.అలాంటి కూరగాయల్లో క్యాబేజ్ ఒకటి.
క్యాబేజ్‌లోనే గ్రీన్ క్యాబేజ్, వైట్ క్యాబేజ్, రెడ్ క్యాబేజ్ ఇలా పలు రంగులు ఉంటాయి.అయితే మిగిలిన వాటితో పోలిస్తే.
రెడ్ క్యాబేజ్‌లో పోషకాలు కాస్త ఎక్కువ ఉంటాయి.అంతేకాదు, ఈ రెడ్ క్యాబేజ్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
అందుకే రెడ్ క్యాబేజ్ గురించి తెలిస్తే తినకుండా ఉండలేరని అంటుంటారు.మరి ఇంతకీ రెడ్ క్యాబేజ్‌లో ఏ ఏ పోషకాలు ఉంటాయి? రెడ్ క్యాబేజ్ అందించే హెల్త్ బెనిఫిట్స్ ఏంటీ? అన్న విషయాలు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉండే రెడ్ క్యాబేజ్‌లో విటమిన్ బి, విటమన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, ఫోలెట్, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, మాంగనిస్, ఫైబర్, ఐరన్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, పైటో కెమికల్స్, ఎమినో యాసిడ్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అందుకే రెడ్ క్యాబేజ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా.రెడ్ క్యాబేజ్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు రాకుండా ఉంటాయి.అలాగే రెడ్ క్యాబేజ్ తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.దాంతో వైరస్‌లు, వైరల్ ఫీవర్లు ఎటాక్ చేయకుండా ఉంటాయి.అధిక బరువును తగ్గించడంలో రెడ్ క్యాబేజ్ గ్రేట్‌గా సహాయపడుతుంది.రెడ్ క్యాబేజ్ జ్యూస్ లేదా రెడ్ క్యాబేజ్‌తో తయారు చేసిన సలాడ్స్ ను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తొలిగించి.జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరచడంలో రెడ్ క్యాబేజ్ ఉపయోగపడుతుంది.అందువల్ల, వారంలో ఒకటి, రెండు సార్లు రెడ్ క్యాబేజ్ తీసుకుంటే ఉత్తమం.ఇక రెడ్ క్యాబేజ్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది.
రక్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.మెదడు చురుగ్గా పని చేస్తుంది.
మతిమరుపు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.