చుండ్రు.చాలా మందిని కలవర పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.
చుండ్రును వదిలించుకోవడం కోసం అధిక శాతం మంది ఖరీదైన షాంపూను వాడుతుంటారు.అయితే షాంపూ తోనే చుండ్రు పోతుంది అనుకుంటే పొరపాటే.
నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చుండ్రును వదిలించడానికి ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ ను కనుక వాడితే చుండ్రు మాయం అవ్వడమే కాదు హెయిర్ గ్రోత్ రెట్టింపు కూడా అవుతుంది.
మరి ఇంతకీ చుండ్రును తరిమికొట్టే ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఏడు నుంచి ఎనిమిది రెబ్బల వేపాకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ మరియు పూర్తిగా ఎండిన వేపాకు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, కలోంజీ మరియు వేపాకుల పొడిని వేసుకోవాలి.
అలాగే ఒక గ్లాస్ కొబ్బరి నూనెను వేసి బాగా మిక్స్ చేసి టైట్ గా మూత పెట్టి వారం రోజుల పాటు వదిలేయాలి.వారం రోజులు గడిచిన తర్వాత పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకొని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి.రెండు గంటల అనంతరం లేదా మరుసటి రోజు మైల్డ్ షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే క్రమంగా మాయమవుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా దృఢంగా మారతాయి.మరియు హెయిర్ గ్రోత్ సైతం అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.దాంతో మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.కాబట్టి తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.