షుగర్ వ్యాధి లేదా మధుమేహం.ఒక్కసారి వచ్చిదంటే జీవితాంతం మనతోనే ఉంటుంది.
ఇన్సులిన్ పవర్ తగ్గిపోవటంతో శరీరంలోని రక్తంలో అధిక గ్లూకోజు నిల్వల కారణంగా షుగర్ వ్యాధి వస్తుంటుంది.అయితే అరవై ఏళ్లకు రావాల్సిన ఈ వ్యాధి.
నేటి కాలంలో ఇరవై, ముప్పై ఏళ్లకే వస్తుంది.అధికంగా బరువు ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, కొన్ని సందర్భాల్లో వారసత్వ పరంగా కూడా మధుమేహం వస్తుంది.
అయితే ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే.సరైన జాగ్రత్తలు పాటిస్తే షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉచ్చి.ఆరోగ్యంగా ఉండవచ్చు.ఇక సాధారణంగా మధుమేహం ఉన్నవారు పండ్లు తినకూడదని అనుకుంటారు.
ఈ క్రమంలోనే పండ్లు తినడానికి భయపడతారు.కాని, పూర్తిగా పండ్లకు దూరం అయితే.
వాటి నుంచే వచ్చే పోషకాలు అన్నీ మీకు దూరమవుతాయి.అందుకే షుగర్ పేషెంట్లు ఖచ్చితంగా పండ్లు తీసుకోవాలి.
కాని, అవి తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండు..బరువు తగ్గడం, ప్రేగు సంబంధిత రుగ్మతలు, మలబద్ధకం ఉపశమనం, రక్తహీనత ఇలా సమస్యలకు చెక్ పెట్టే ఈ పండులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండాయి.అందుకే మధుమేహ రోగులు అరటిపండును పూర్తిగా తినకుండా సగం ముక్కను తీసుకుంటే మంచిది.
యాపిల్.మిగిలిన పండ్లన్నింటిలో కంటే ఎక్కువ పోషకాలు ఇందులోనే ఉన్నాయి.
యాపిల్ కొలెస్ట్రాల్ నిలువలు తగ్గిస్తుంది.జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది.
అయితే మధుమేహ రోగులు రోజుకు ఒక యాపిల్ తింటే ఎలాంటి సమస్యలు ఉండవు.అంతకు మించి తింటే మాత్రం అనేక సమస్యలు ఎదురవుతాయి.బొప్పాయి.గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది.
షుగర్ ని అదుపులో ఉంచుతుంది.మరియు కాన్సర్ రాకుండా చూస్తుంది.
అయితే బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో, అతిగాగా తీసుకుంటే అంతే చెడ్డది.కాబట్టి, షుగర్ పేషెంట్లు బొప్పాయిని మితంగా మాత్రమే తీసుకోవాలి.
సీతాఫలం.ఇందులో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే.షుగర్ పేషెంట్లు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
అలాగే దానిమ్మ మధమేహ రోగులకు మంచి ఆహారం.అలా అని ఓవర్‌గా మాత్రం తీసుకోకూడదు.
రోజుకు ఒకటి తింటే.రక్తంలోని చక్కెరను నియంత్రించే శక్తి దానిమ్మలో పుష్కలంగా ఉంటుంది.