గోరు చిక్కుడు కాయలు.ఆరోకరమైన కూరగాయల్లో ఇవి ఒకటి.
మార్కెట్‌లో విరి విరిగా లభించే గోరు చిక్కుడు కాయల ధర కూడా కాస్త తక్కువే అని చెప్పాలి.పల్లెటూర్లలో అయితే చాలా మంది పెరటిలోనే గోరు చిక్కుడు పాదులను పెంచుకుంటారు.
గోరు చిక్కుడుతో ఎన్నో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.ఎలా చేసినా గోరు చిక్కుడు రుచి అద్భుతంగా ఉంటుంది.
ఇక రుచిలోనే కాదు.గోరు చిక్కుడులో విటమిన్స్, మినరల్స్, కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు కూడా నిండి ఉంటాయి.
అందుకే వారానికోసారి గోరు చిక్కుడు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా గోరు చిక్కుడు వారికి ఒక సారి తీసుకోవడం వల్ల రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
దాంతో గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది.

అలాగే బరువు తగ్గాలనే ప్రయత్నించే వారు ఖచ్చితంగా గోరు చిక్కుడును డైట్‌లో చేర్చుకోవడం మంచిది.గోరు చిక్కుడులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.పైగా వీటని కొద్దిగా తీసుకున్నా.ఎక్కుడ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.దాంతో వేరే ఆహారాలపై దృష్టి మల్లదు.ఫలింగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
గోరు చిక్కుడులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.అందువల్ల, రక్త హీనత సమస్యతో బాధ పడే వారు కనీసం వారానికి ఒక సారి గోరు చిక్కుడు తింటే రక్త వృద్ధి జరుగుతంది.
అలాగే గోరు చిక్కుడు ఫైబర్ అత్యధికంగా ఉంటుంది.మలబద్ధకంతో బాధ పడే వారు గోరు చిక్కుడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.వారానికోసారి గోరు చిక్కుడు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మెరుగుడుతుంది.గర్భిణీలకు, చిన్న పిల్లలు కూడా గోరు చిక్కుడు తింటే మంచిది.
ఇక చర్మానికి కూడా గోరు చిక్కుడు ఎంతో మేలు చేస్తుంది.గోరు చిక్కుడును ప్రతి వారం తీసుకుంటే.
మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.చర్మ కాంతి పెరుగుతుంది.