బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరొక ఘోరం చోటు చేసుకుంది.గిరిజనులు ఎక్కువగా ఉండే అలీరాజ్ పూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికను ఒక నీచుడు రేప్ చేశాడు.అయితే తల్లిదండ్రులు అత్యాచారానికి గురైన తమ 16ఏళ్ల బాలికకు అండగా ఉండాల్సింది పోయి ఆమెను అవమానిస్తూ వీధుల వెంట తిప్పారు.21 ఏళ్ల యువకుడు పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు అని తెలుసుకున్న తర్వాత అలీరాజ్ పూర్ జిల్లా ప్రజలు నిందితుడితో పాటు బాధితురాలిని పట్టుకొని చితకబాదారు.అనంతరం వారిద్దరిని ఒక తాడుతో కట్టేసి వీధుల్లో తిప్పుతూ ఘోరంగా అవమానించారు.భారత్ మాతాకీ జై అంటూ బాధితురాలని పశువులా కట్టేసి రోడ్లమీద తిప్పుతూ ఆమె పరువుకి భంగం కలిగించారు.
అయితే ఇంత ఘోరం జరుగుతున్నా బాధితురాలి కుటుంబ సభ్యులు అడ్డుకోలేదు సరి కదా సాక్షాత్తు వారే తమ ఆడబిడ్డ ని అవమానించారు.తాను చేయని తప్పుకు కూడా తన అనుకున్నవాళ్లే తనని బాధించడం తో ఆమె ఎంత విలవిలలాడింతో అర్థం చేసుకోవచ్చు.
ఒక భారత స్త్రీ ని చిత్రహింసలు పెడుతూ భారత్ మాతాకీ జై అంటూ అలీరాజ్ పూర్ జిల్లా వాసులు చేసిన నీచమైన పనికి అందరూ విస్తుపోతున్నారు.
అయితే ఈ ఉదంతానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మాధ్యమాల్లోవైరల్ అయ్యింది.
కొందరి నెటిజన్లు ఈ అమానుషమైన ఘటనపై స్పందించాలని స్థానిక పోలీసులనుసోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 21 ఏళ్ల నిందితుడుతో పాటు ఆమెను తాడుతో కట్టించిన ప్రజలను మరియు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.ఏది ఏమైనా భారతదేశంలో ఇంతటి ఘోరాలు కూడా జరుగుతున్నాయా నెటిజన్లు షాక్ అవుతున్నారు.
తెలిసీ తెలియని వయసులో అబ్బాయి తో మాట్లాడినా కూడా ఇక్కడి అమ్మాయిలను మరింత కఠినంగా హింసిస్తుంటారు.ఈ ప్రాంత గిరిజనులు చిన్నపిల్లలు అని కూడా చూడకుండా కర్రలతో కొడుతూ ఊరంతా తిప్పుతూ చిత్రహింసలు పెడుతుంటారు.
అయితే ఆడవారిపై జరిగే ఇలాంటి అవమానమైన ఘటనలను అరికట్టాలని ఇతర ప్రాంత వాసులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.