వేసవికాలంలో పుదీనాతో.. ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

Benefits Of Mint In Summer Season Details, Benefits Of Mint ,summer Season, Mint, Mint Leaves, Mint Tea, Mint Health Benefits, Digestion Problems, Skin Moisture, Pudina , Pudina Tea

ఎండాకాలం( Summer ) మొదలైపోయింది.అందుకే ఈ సీజన్లో ఆహారం అలాగే ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించాలి.

 Benefits Of Mint In Summer Season Details, Benefits Of Mint ,summer Season, Mint-TeluguStop.com

అప్పుడే మనం ఫిట్ గా ఉంటాము.అలాగే వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు.

శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ద్రవాలతో కూడిన పోషకమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.అంతేకాకుండా వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల పానీయాలను కూడా తాగాలి.

అయితే వేసవిలో పుదినాకు ( Mint ) మంచి డిమాండ్ ఉంది.ఇది వేసవికాలంలో మనకు ప్రయోజనకరంగా పనిచేస్తుంది.

పుదీనా ఆకు అనేక రకాలుగా వాడడానికి కూడా కారణం ఇదే.వేసవిలో పుదినాన్ని తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.పుదీనా చట్నీ చేసుకొని తినడం వలన జీర్ణ క్రియలకు( Digestion ) సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి.అంతేకాకుండా కడుపులో నొప్పి ఉంటే పుదీనా, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువను కలిపి తింటే తక్షణమే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

ఇక పుదీనా, దోసకాయ లాంటివి చర్మానికి బాగా మేలు చేస్తాయి.

ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.పుదీనా ఆకుల రసాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం తేమతో పాటు తాజాదనాన్ని కూడా పొందుతుంది.పుదీనా ఆకుల నుంచి రసం తీసి పెరుగు లేదా తేనె కలిపి కూడా ముఖానికి రాసుకోవాలి.

ఈ ప్యాక్ చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది.అలర్జీ సమస్యతో బాధపడుతుంటే పుదీనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ముక్కు, కళ్ళకు సంబంధించిన అలర్జీలను తొలగించడంలో పుదీనా బాగా సహాయపడుతుంది.

అంతేకాకుండా మనసును ప్రశాంతంగా ఉంచడానికి కూడా అలాగే ఒత్తిడిని దూరం చేయడానికి కూడా పుదీనా సహాయపడుతుంది.అంతేకాకుండా దగ్గు, జలుబు లాంటివి ఉంటే ఈ ఆకుతో పుదీనా టీ చేసుకుని తాగడం వలన ఉపశమనం లభిస్తుంది.అంతేకాకుండా పుదీనా, నిమ్మకాయ, తేనెతో కలిపి పానీయం లాగా తయారు చేసుకుని తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Video : వేసవికాలంలో పుదీనాతో ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలు #TeluguStopVideo

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube