ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతరకు అరుదైన గుర్తింపును ఇస్తూ రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
తిరుమల శ్రీవారికి స్వయానా చెల్లెలు తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఇకపై సర్కార్ అధికారికంగా నిర్వహించనుంది.సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను ప్రతిబింబిస్తుంది.
మరోవైపు మే 1వ తేదీ నుంచి 5 వ తారీఖు వరకు కంచి పీఠాధిపతులు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.అదేవిధంగా మే 9న పుట్టింటి సారె, చాటింపుతో జాతర ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది.
కాగా ప్రస్తుతం ఆలయ పునర్ నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.







