కోవిడ్ సమయం లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ? అయితే ఇది మీకోసమే...!

కరోనా కష్ట కాలంలో ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.కరోనా వైరస్ ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో వ్యాప్తి చెందుతుందో అని భయంతో వణికిపోతున్నారు.

 Side Effects Of Eating Dry Fruits Heavily, Health Benefits, Dry Fruits, Over Wei-TeluguStop.com

అందుకనే ప్రజలు అందరు రోగనిరోధక శక్తి పెంచుకోవటం కోసం చాలా ట్రై చేస్తున్నారు.కొందరు అయితే ఇమ్మ్యూనిటి శక్తిని పెంచుకోవడానికి విటమిన్ సి ట్యాబ్లెట్లను వేసుకుంటున్నారు.

మరికొందరు అయితే డ్రై ఫ్రూట్స్ తిని ఇమ్యూనిటీని పెంచుకుంటున్నారు.

అయితే, డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ… అతిగా తినటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్య నిపుణులు.

ఏదయినా సరే మన శరీరానికి సరిపడా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.మితంగా తీసుకుంటే మంచిది.కరోనా వైరస్ మన రోజు వారి తినే ఆహారం మీద కూడా ప్రభావం చూపింది.రెగ్యులర్ మీల్స్, డైట్ తో పాటు హెల్దీ ఫుడ్ కంపల్సరీగా ఉండాలి అనటంతో ఇమ్యూనిటీ పెంచుకునే ఆహారం మీద ప్రజలు మక్కువ చూపుతున్నారు.

అందుకనే డ్రై ప్రూట్స్ తినటానికి ఇష్టపడుతున్నారు.వీటి ధర కూడా ఎక్కువే.

అయినా గాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తింటున్నారు.

కరోనా కారణంగా అన్ని బిజినెస్ లు పడిపోతే, డ్రై ఫ్రూట్స్ వ్యాపారం మాత్రం జోరు అందుకుంది.అవసరం ఉన్నా లేకున్నా పెద్ద ఎత్తున జనం డ్రై ప్రూట్స్ తింటున్నారు.అయితే డ్రై ప్రూట్స్ వల్ల కొన్ని విటమిన్లతో పాటు వెంటనే శక్తి కూడా అందుతుంది.

కానీ, మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం కంటే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాధం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.వాస్తవానికి డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పు, పిస్తా, కాజు, వంటివి జనం ఎక్కువగా తింటున్నారు.

కానీ, ఇవి ఎక్కువగా అంటే మోతాదుకు మించి తింటే శరీరంలో ఫ్యాట్ పెరిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.ముఖ్యంగా ఊబకాయం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.

అసలే కరోనా వేళ ప్రజలు అందరు ఇంట్లోనే ఉంటున్నారు.ఒక పక్క శారీరిక శ్రమ అనేది లేదు.

దీనితో అందరు ఇంట్లోనే కూర్చిని, డ్రై ఫ్రూట్స్ ఎక్కువుగా తింటే లావు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.

Side Effects Of Eating Dry Fruits Heavily, Health Benefits, Dry Fruits, Over Weight, Nutrition, Kaju, Almonds, Dry Fruits For Health - Telugu Almonds, Baddam, Doctors, Dry Fruits, Fatness, Fitness, Benefits, Kaju, Lock, Effectsdry

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube