మీకు ఈ చెడ్డ అల‌వాట్లు ఉంటే వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా వ‌స్తాయ‌ట‌..జాగ్ర‌త్త‌!

చ‌ర్మం సాగి పోవ‌డం, ముడ‌త‌లు రావ‌డం, స‌న్న‌ని చార‌లు ఏర్ప‌డ‌టం, స్కిన్ నిర్జీవంగా మార‌డం.వీటినే వృద్ధాప్య ఛాయ‌లు అని అంటారు.

 If You Have These Bad Habits The Shades Of Aging Will Come On Quickly! Aging Pro-TeluguStop.com

వ‌య‌సు పెరిగే కొద్ది వృద్ధాప్య ఛాయ‌లు ఏర్ప‌డటం చాలా కామ‌న్‌.కానీ, నేటి కాలంలో పాతిక‌, ముప్పై ఏళ్ల వారిలో సైతం ఈ స‌మ‌స్య క‌నిపిస్తున్నారు.

అస‌లు త‌క్కువ వ‌య‌సులోనే వృద్ధ‌ప్య ఛాయ‌లు రావ‌డానికి కార‌ణాలు ఏంటో తెలుసా… మీకు ఉండే కొన్ని చెడ్డ అల‌వాట్లే.ఆ అల‌వాట్లు ఏంటీ.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా కొంద‌రికి స్వీట్లు అంటే మ‌హా ఇష్టం.

స్వీట్లు క‌నిపిస్తే చాలు లెక్క‌లేన‌న్నీ లాగించేస్తుంటారు.అయితే చ‌క్కెర‌తో త‌యారు చేసే స్వీట్ల‌ను ప‌రిమితికి మించి తీసుకుంటే త్వ‌ర‌గా వృద్ధాప్య ఛాయ‌లు వ‌స్తాయి.

నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం.నేటి టెక్నాల‌జీ కాలంలో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మందికి ఇదో అల‌వాటుగా మారింది.

కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ సౌంద‌ర్య దెబ్బ తింటుంది.దాంతో త‌క్కువ ఏజ్‌లోనే ముడ‌త‌లు, తెల్ల‌ని చార‌లు, చ‌ర్మం సాగి పోవ‌డం వంటివి జ‌రుగుతాయి.

/br>

అలాగే మాయిశ్చరైజర్ ఎవైడ్ చేయ‌డం.ఎంద‌రికో ఉండే అల‌వాటిది.ఈ కార‌ణంగా కూడా వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా వ‌స్తాయి.అందుకే ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రం స్నానం చేసిన వెంట‌నే బాడీకి మంచి మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేసుకుంటే.

చ‌ర్మం తేమ‌గా ఉంటుంది./br>

వాట‌ర్‌ను నెగ్లెట్ చేయ‌డం వ‌ల్ల సైతం ఫాస్ట్‌గా వృద్ధాప్య ఛాయ‌లు వ‌చ్చేస్తాయి.అందుకే ప్ర‌తి రోజు ప‌న్నెండు గ్లాసుల వాట‌ర్‌ను సేవించాలి.త‌ద్వారా చ‌ర్మ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.

సోడా, కాఫీ, మద్యం, నూనె ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్‌, ప్యాక్డ్ ఫుడ్స్ వంటివి ఎక్కువ‌గా తీసుకునే అల‌వాటు ఉన్నా వృద్ధాప్య ఛాయ‌లు చిన్న వ‌య‌సులోనే త‌లుపు త‌డ‌తాయి.కాబ‌ట్టి, వీటిని ఎంత దూరంగా మీ స్కిన్ అంత హెల్త‌గా ఉంటుంది.

ఇక పైన చెప్పుకున్న అల‌వాట్ల‌ను మానుకోవ‌డ‌మే కాదు.డైట్‌లో పోష‌కాహ‌రం ఉండేలా చూసుకోవాలి.ప్ర‌తి రోజు వ్యాయామాలు చేస్తుండాలి.రోజుకు క‌నీసం ప‌ది నిమిషాలైనా మ‌న‌సారా న‌వ్వుకోవాలి.

ఇవి పాటిస్తే వ‌య‌సు ఎంత పెరిగినా మీరు యంగ్‌గానే క‌నిపిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube