హిందూ ఆలయాల్లోని విగ్రహాలు( Idols ) కొన్ని స్వయంభు అయితే మరికొన్ని మాత్రం ప్రాణ ప్రతిష్ట చేసినవి.అయితే ప్రాణ ప్రతిష్ట చేసిన విగ్రహాలను వివిధ లోహాలు, రాళ్లతో ప్రత్యేకంగా తయారు చేస్తారు.
అయితే భారతదేశం మొత్తంలో తొమ్మిది విషపూరిత లోహాలతో తయారైన ఏకైక విగ్రహం పళని మురుగన్ విగ్రహం.( Palani Murugan Idol ) అయితే తమిళనాడులోని కుళంతాయ్ వేళప్పార్ ఆలయంలో( Kulanthai Velappar Temple ) ఈ విగ్రహం ఉంది.
ఈ ఆలయంలో మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు.బోగార్ అనే మహర్షి మురుగన్ కి అమిత భక్తుడు.18 వ శతాబ్దంలో మురుగన్ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేశారు.
అయితే ఆ సమయంలో బోగార్ మురుగన్ విగ్రహాన్ని 9 విషపూరితమైన లోహాలతో( 9 Poisonous Metals ) తయారుచేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.కానీ అసలు విచిత్రం ఏమిటంటే మురుగన్ విగ్రహానికి అభిషేకం చేసిన పాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు.అయితే ఈ పాలు ఎన్నో ప్రయోజనాలని ఇస్తుందని అక్కడి భక్తులు గట్టిగా నమ్ముతారు.
ఈ పాలు( Milk ) తాగిన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందారని కూడా అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు.ఈ పాలు నయం అవ్వని అన్ని వ్యాధులను కూడా నయం చేయగలుగుతుందని అక్కడి భక్తులు నమ్మకం.
అలాగే వాళ్లు రాత్రి వేళల్లో స్వామివారికి గంధం రాసి తుడవకుండా అలాగే వదిలేస్తారట.ఇక ఉదయానికే ఆ గంధం రాసుకుంటే వ్యాధులను నివారిస్తుందని అక్కడి ప్రజల్లో నమ్మకం.కాబట్టి దీనికోసం ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు.అలాగే అనేక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు కూడా ఇక్కడికి చేరుకొని పాలాభిషేకం, గంధం రాసుకొని వెళతారు.ఇక తమిళనాడు అంటేనే ఆలయాలకి పెట్టిందే పేరు.కాబట్టి ఇక్కడి ఆలయాలకు చాలా విశిష్టత ఉంటుంది.
తమిళనాడు కు వెళితే కచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాల్సిందే.
LATEST NEWS - TELUGU