అధికమాసం ఎప్పుడు వస్తుంది? ఈ మాసంలో ఈ నియమాలను పాటిస్తే..?

అధికమాసం చంద్రమానం ప్రకారం నడిచే హిందూ క్యాలెండర్( Hindu Calendar )లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.ఈ అధికమాసం కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాడం, శ్రావణం,( Sravanam ) భాద్రపదం, అశ్వయుజం వంటి ఆరు మాసాలకు మాత్రమే వస్తుంది.

 When Does The New Moon Come? If You Follow These Rules This Month, Vaisakh,, Jye-TeluguStop.com

చైత్రం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం,ఫాల్గుణ మాసాలకు ఎప్పుడు అధికమాసం రాదని పండితులు చెబుతున్నారు.ఒకసారి అధికమాసం వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది.

ఆ తర్వాత 34, 34, 35, 30, 28 నెలలకు వస్తుంది.

Telugu Ashadam, Asvayujam, Bhadrapadam, Bhakti, Devotional, Jyeshtam, Puja, Vais

అధికమాసం( Adhika Masam ) ముందు వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది.ఈ అధిక మాసాన్ని మైల మాసం అని కూడా అంటారు.అంటే ఈ అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.

అధికమాసము చంద్రమానం ద్వారానే వస్తుంది.చంద్రమానం అంటే చంద్రకళలను ఆధారంగా నెల రోజులను లెక్కించడం.

సూర్యుడు సంవత్సరంలో 12 రాశుల చక్రాన్ని పూర్తి చేస్తే, చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే ఉంటాడు.మన హిందూ సంప్రదాయంలోని చంద్రమానం, సౌర మానం, బార్హస్పత్య మానం లాంటివి మూడు ఉంటాయి.

ఎక్కువ మటుకు చంద్రమానం ప్రకారమే మనము పూజలు నిర్వహిస్తూ ఉంటాము.చంద్రమానం ఒక సంవత్సరానికి 354 రోజులు.అంటే చంద్రమానంలో 11 రోజుల తేడా ఉంటుంది.సౌరమానం చంద్రమానంలో ఈ తేడా ప్రతి నాలుగు సంవత్సరాలలో 31 రోజులు అవుతుంది.

ఈ రకంగా అధికమాసం ఏర్పడుతుంది.అందుచేత 32 నెలలకు ఒకసారి ఏర్పడు మాసాన్ని అధికమాసంగా, చంద్రమాన సంవత్సరానికి సౌరమాన సంవత్సరానికి ఉన్న తేడాను సరి చేసేందుకు చంద్రమాన సంవత్సరంలో ఒక నెల అధికంగా జోడించి అధికమాసం గా పరిగణిస్తారు.

Telugu Ashadam, Asvayujam, Bhadrapadam, Bhakti, Devotional, Jyeshtam, Puja, Vais

ముఖ్యంగా చెప్పాలంటే సూర్యుడు భూమి చుట్టూ తిరగడానికి 365 రోజుల ఆరు గంటల 11 నిమిషములు 31 సెకండ్లు పడుతుంది.చంద్రునికైతే 324 రోజులే పడుతుంది.వీరిద్దరి మధ్య తేడా సుమారు 41 రోజులు ఉంటుంది.ఈ వ్యత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టూ 19 సార్లు తిరిగితే, చంద్రుడు 235 సార్లు తిరుగుతాడు.

అధిక మాసంలో పూజలు, వ్రతాలు, పితృదేవతరాదన, ధన ధర్మాలు వంటివి విరివిగా ఆచరించాలి.మన పురాణాలలో అధికమాసానికి పురుషోత్తమ మాసమని పేరు ఉంది.అధికమాసంలో చేసేటువంటి పనులు అధిక ఫలాలు ఇస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube