పోలేరమ్మ గ్రామోత్సవం ఎలా జరిగిందంటే..

ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయంలోని దేవతలకు ప్రతి సంవత్సరానికి ఒకసారి గ్రామ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు.అలాగే అల్లూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పోలేరమ్మ ఉత్సవం గ్రామ పెద్దల సహకారంతో అంగరంగ వైభవంగా భక్తులందరూ భారీగా తరలివచ్చి జరిపారు.

 Alluru Poleramma Jathara Celebrations Details, Alluru ,poleramma Jathara Celebra-TeluguStop.com

మాజీ శాసనసభ సభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో గంగమ్మ, కలుగులమ్మ, పోలేరమ్మ అమ్మవారికి భక్తుడు ప్రతి సంవత్సరం ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు.ఒకరికి ఒకరు ఎదురుపడకుండా పురవీధులలో ఊరేగించి అమ్మవార్లను దేవాలయాలకు పంపిస్తారు.

కొత్త సంవత్సరంలో ముచ్చటగా ముగ్గురు అమ్మవార్ల ఊరేగింపుగా తమ ఇంటి ముందు చేరుకున్న తర్వాత మహిళలు అందంగా రంగవల్లులు వేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు.మతమ్మకు పూజలు అమ్మవారికి అభిషేకం కుమ్మరి సాంప్రదాయం మేరకు అఖండ ప్రతిష్ట, గంగమ్మకు వెండి చీరలతో అలంకారం, అలాగే తూర్పు వీధి మహాలక్ష్మి అమ్మ గుడి వద్ద నుండి కాటంరెడ్డి శివప్రియ ఆధ్వర్యంలో సంప్రదా దుస్తులతో మహిళలు అక్కడకు చేరుకొని

Telugu Alluru, Alluru Jathara, Allurupoleramma, Bhakti, Devotional, Gangamma, Ka

1001 కుండలతో అమ్మవారికి అత్యంత ఇష్టమైన సద్దిని ఊరేగింపుగా తీసుకువెళ్లి సద్ది నివేదన కార్యక్రమాన్ని చేశారు.పోతురాజుకు ప్రత్యేక పూజలు అమ్మవారి గుడి దగ్గర పొంగళ్లను నిర్వహించారు.భక్తులకు అమ్మవారు బంగారు చీరతో ప్రదర్శనమిచ్చారు.

గంగమ్మకు ముత్యాల చీర, నాదస్వర కచేరి, రామదేవతలకు పూజలు, తెనాలి వారితో నవాదుర్గలు, భజనలు, తప్పట్లు, తీన్మార్ బ్యాండ్లు, కేరళ వాయిద్యాలు, మిరుముట్లు, విద్యుత్ దీపాలతో భారీ ఏర్పాట్లను చేశారు.

Telugu Alluru, Alluru Jathara, Allurupoleramma, Bhakti, Devotional, Gangamma, Ka

యువతను అలరించేందుకు ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్, రైజింగ్ రాజు టీం, పల్సర్ బైక్ రమణ, మానస టీవీ యాంకర్, పాడుతా తీయగా సింగర్స్ వచ్చి యువతను అలరించారు.అమ్మవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.అంతేకాకుండా గంగమ్మ, కలుగులమ్మ, పోలేరమ్మ దేవాలయ నుంచి శోభాయానమానంగా ఊరంతా విద్యుత్ దీపాలు వెలిగించడంతో పండగ వాతావరణం నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube