మన దేశవ్యాప్తంగా పండుగలను చాలామంది ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు.అలాగే దీపావళి పండుగ తర్వాత వచ్చే కార్తీక మాసాన్ని కూడా చాలామంది ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం కార్తీకమాసంలో 15 రోజుల్లోనే రెండు గ్రహణాలు వచ్చే అవకాశం ఉంది.మహాభారత యుద్ధానికి ముందు కూడా ఇలాంటి గ్రహణాలు కార్తీక మాసంలో వచ్చాయట.
అక్టోబర్ 25న జరిగినా సూర్యగ్రహణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 25న ఏర్పడింది.
భారతదేశ కాలమానం ప్రకారం ఈ గ్రహణం అక్టోబర్ 25 ఉదయం 11:28 నిమిషాలకు ప్రారంభమైంది.ఈ గ్రహణం దాదాపు సాయంత్రం 5:25 నిమిషములకు ముగిసింది.జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం ఈ సూర్యగ్రహణం ఈశాన్య భారతదేశంలో కాకుండా మిగిలిన అన్ని ప్రాంతాలలో కనిపించింది.ఈ ఏడాది సూర్యగ్రహణం సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, కేతువులతో కలిసి ఉంటుంది.
ఈ సూర్యగ్రహణం అక్టోబర్ 25వ తేదీన కృష్ణ నగరంలోని మధురలో సాయంత్రం 4:32 గంటలకు మొదలై 05:42 వరకు ఉంది.ఈ సూర్యగ్రహణం నగరంలో 1 గంట 10 నిమిషాల పాటు ఉంటుంది.
ఈసారి 44% సూర్యునికి గ్రహణం పట్టిందని ఖగోల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ సంవత్సరం 15 రోజుల వ్యవధిలోనే రెండు గ్రహాలు రావడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అని శాస్త్రవేత్తలు ఆందోళనకు గురవుతున్నారు.అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడింది.నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడనుంది.భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం నవంబర్ 8 మంగళవారం మధ్యాహ్నం 1.32 నుండి రాత్రి 7.27 గంటల వరకు ఉండే అవకాశం ఉంది.మహాభారత యుద్ధానికి ముందు కూడా, కార్తీక మాసంలో రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి.
తరువాత భీకర యుద్ధం జరిగింది.ఈ యుద్ధంలో చాలామంది పోరాటయోధులు మరణించారు.
ఈ సంవత్సరం కూడా ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమో అని జ్యోతిష శాస్త్ర నిపుణులు ఆందోళన పడుతున్నారు.