మన భారత దేశంలో చాలామంది ప్రజలు రాశిఫలాలతో పాటు చేతి గీతలను కూడా నమ్ముతుంటారు.జీవితంలో ఏ చిన్న విషయం జరిగినా అది వారి తలరాతాన్ని భావిస్తూ ఉంటారు.
ఇలాంటి కొన్ని రాశుల వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంవల్ల మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది.మేష రాశి వారు తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలనే ఆలోచన లో కూరుకుపోవచ్చు.
శాశ్వత ఆస్తి పనులు కూడా వాయిదా వేయవలసి ఉంటుంది.మానసికంగా మీ ఏకాగ్రత తగ్గుతుంది.
శారీరక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.డబ్బు సంబంధిత లావాదేవీలలో జాగ్రత్త వహించండి.
ప్రమాదాలు జరగవచ్చు, నెమ్మది గా డ్రైవ్ చెయ్యడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం తగ్గవచ్చు.మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మారవచ్చు.
కన్య రాశి వారు ఉదయం నడక, భోజనం, స్నేహితులతో వినోదాలలో గడపవచ్చు.భాగస్వామ్య పనులలో జాగ్రత్త వహించండి.వ్యాపారంలో ఎక్కువ లాభాలను ఆశించవద్దు.మీరు ఆరోగ్య పరంగా బలహీనంగా ఉంటారు.
ప్రమాదవశాత్తు ఆసుపత్రి ఖర్చు ఉండవచ్చు.ధనుస్సు రాశి వారు కుటుంబ శాంతిని కాపాడేందుకు అనవసర వాదనలు చేయకుండా ఉంటే మంచిది.
డబ్బు, కీర్తి నష్టం ఉండవచ్చు.మధ్యాహ్నం తర్వాత మీ స్వభావంలో భావోద్వేగం పెరుగుతుంది.
విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.ఆత్మీయులతో సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంది.

మకర రాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.స్నేహితులు, ప్రియమైన వారితో సమావేశం సంతోషంగా ఉంటుంది.చిన్న ట్రిప్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.సోదరులతో సాన్నిహిత్యం పెరుగుతుంది.ఈ మధ్యాహ్నం తర్వాత శారీరకంగా హుషారుగా ఉండలేరు.ధన నష్టం జరిగే అవకాశం ఉంది.
శాశ్వత ఆస్తి పత్రాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.వీరికి తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది.