ఏపీలో రాజధాని వ్యవహారంపై అగ్గి రాజుకుంది.ఈ విషయంపై అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య వార్ కొనసాగుతుంది.
తాజాగా ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనపై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారు.రాష్ట్రాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించండి అంటూ ట్విట్ చేశారు.25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులకు వెళ్లండి.ఏపీని వైసీపీ రాజ్యంగా మార్చుకోండి అంటూ ట్విట్టర్ లో విమర్శలు చేశారు.
సర్వతోముఖాభివృద్ధికి వికేంద్రీకరణ మంత్రమని భావిస్తే ఏపీని మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలని ప్రశ్నించారు.వైసీపీ వాళ్లు చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తారన్నారు.కానీ పౌరుల మనోభావాలను పైసా కూడా పట్టించుకోరని ఎద్దేవా చేశారు.







