ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే తులసి కోటను చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్క ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తాము.మన హిందువుల ఇంటి ఆవరణంలో తులసి మొక్క లేని ఇల్లు అంటూ ఉండదు.

 Observe Tulasi Vrat On Friday For Prosperity, Tulasi, Tulasi Kota, Friday, Pooja-TeluguStop.com

ఇలా తులసికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి కోటకు పూజ చేయడం చూస్తుంటాము.తులసి మొక్కను సాక్షాత్తు మహాలక్ష్మిగా భావించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేయటం వల్ల మన ఇంటిలో ఏ విధమైనటువంటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉండవని భావిస్తారు.

అయితే ఈ తులసి మొక్కను పూజించడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి.సాయంత్రం తులసి మొక్కను పూజించేటప్పుడు తులసికోటకు పొరపాటున కూడా నీరు పోయకూడదు.సాయంత్రం సమయంలో తులసి చెట్టు కింద సాక్షాత్తు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూర్చుని ఉంటారని అందుకే సాయంత్రం తులసి కోటకు నీళ్లు పోయకూడదని పండితులు చెబుతారు.అదేవిధంగా అమావాస్య, పౌర్ణమి, మంగళ, ఆదివారం, ద్వాదశి వంటి రోజులలో తులసి దళాలను తెంపకూడదని చెబుతుంటారు.

ఇకపోతే ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే తులసికోటను చూడటం వల్ల ముల్లోకాలలోని సమస్త పుణ్య తీర్థాల చూసిన పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.అందుకే ఉదయం నిద్రలేవగానే తులసి కోటను చూడటం ఎంతో మంచిది.అదే విధంగా మనకు అష్టైశ్వర్యాలు కలగాలంటే 26 శుక్రవారాలు తులసి వ్రతాన్ని చేయడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube