సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరికి హీరోయిన్ అవ్వాలనే ఉంటుంది.నాటి తరం అయినా నేటి తరం అయినా చిన్న చితక పాత్రలు పోషిస్తే ఎప్పుడు అలాంటి పాత్రలే వస్తాయని వారు భావిస్తారు.
అలా అనుకోవడంలోనూ తప్పు లేదు.ఇక వ్యాంప్ లేదంటే ఐటెం పాత్ర చేసారంటే ఇక అంతే.
వారికి కెరీర్ ముగిసే వరకు అవే పాత్రలు ఇస్తారు.అందుకే కొంచం లేట్ అయినా నేటి హీరోయిన్స్ ఏవి పడితే అవి చేయడం లేదు.
ఇక ఈ విషయం లో వాణిశ్రీ ని ఉదాహరణగా తీసుకోవచ్చు.ఆమె మొదట్లో కామెడీ క్యారెక్టర్లు, వాంప్ పాత్రలు పోషించారు.
రాజనాల, పద్మనాభం సరసన చాల సినిమాల్లో నటించారు.వాణిశ్రీ కి తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్న కుమారి.
ఆమె తొలి నాళ్లలో అదే పేరుతో సినిమాల్లో నటించారు.ఇక కాంతారావు తో 1962 లో సోమవార వ్రత మహత్యం అనే సినిమా చేయడానికి వాణిశ్రీకి అవకాశం వచ్చింది.
ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆటవిడుపుగా హీరో అయినా కాంత రావు, విలన్ పాత్ర దారి రాజనాల కలిసి అలెగ్జాండర్ నాటక వేయాలని అనుకున్నారు.అందులో వాణిశ్రీ తో కూడా పాత్ర చేయించడానికి మేకప్ కూడా చేయించి సెట్ కి తీసుకోచ్చారు.
ఆ సినిమా దర్శకుడు కొన్ని భంగిమల్లో స్టిల్స్ తీయించారు.ఇక దర్శకుడు కృష్ణ స్వామి, స్టిల్ ఫోటోగ్రాఫర్ నాగరాజా రావు ఇద్దరు వాణిశ్రీ ని చూసి పెదవి విరిచారు.
ఈ అమ్మాయి హీరోయిన్ వేషానికి పనికి రాదు అన్నారు.కానీ కాంతారావు ఆమెను బలంగా నమ్మాడు.ఆ తర్వాత రణభేరి అనే సినిమాలో వాణిశ్రీ ని హీరోయిన్ గా, వాంప్ పాత్ర కోసం రాజశ్రీ ని బుక్ చేసారు.కానీ ఆ సినిమా కథ మేరకు వాంప్ పాత్ర మంచి బలమైనది.
అందుకు వాణిశ్రీ కరెక్టు అని భావించి ఆమె చేత వాంప్ పాత్ర చేయించి రాజశ్రీ చేత హీరోయిన్ వేషం వేయించారు.
ఆ సినిమా విడుదల అయ్యి వాణిశ్రీ కి మంచి పేరు వచ్చింది.ఆకాశ రామన్న చిత్రంలోనూ ఆమె అలాంటి ఒక పాత్ర పోషించారు.ఎప్పుడు వాంప్ పాత్రలే వస్తున్నాయి ఆమె బాధ పడ్డారు.
కానీ కాంతారావు ఆమెకు దైర్యం చెప్పారు.నీలో మంచి నటి వుంది త్వరలోనే మనం హీరో హీరోయిన్స్ గా సినిమా తీస్తాం అంటూ చెప్పారట.
అయన జోశ్యం ఫలించి ‘దేవుని గెలిచిన మానవుడు, మరపురాని కథ లో వారు నటించారు ఆ తర్వాత ఆమె పెద్ద స్టార్ అయ్యింది.