చలికాలంలో మధుమేహులు పిస్తా తింటే ఎన్ని ప్రయోజనాలు పొందవ‌చ్చో తెలుసా?

రుచికరమైన నట్స్ లో పిస్తా ఒకటి.పిస్తా ఖరీదు కూడా ఎక్కువే.

 So Many Benefits For Diabetics To Eat Pistachios In Winter, Pistachios, Diabetic-TeluguStop.com

కానీ అందుకు తగ్గ పోషకాలు పిస్తా లో పుష్కలంగా నిండి ఉంటాయి.అవి మనకు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ముఖ్యంగా ప్రస్తుత ఈ చలికాలంలో మధుమేహుల‌కు పిస్తా పప్పు ఒక వరం అని చెప్పవచ్చు.పిస్తాను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మధుమేహులు బోలెడన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

రక్తంలో చక్కెర స్థాయిల‌ను నియంత్రించగల సామర్థ్యం పిస్తా పప్పుకు ఉంది.

వాస్తవానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి.అయితే పిస్తా పప్పులు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి.

అందుకే ఇవి మధుమేహులకు ఎంతగానో మేలు చేస్తాయి.పిస్తా పప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని అనేక పరిశోధనల్లో సైతం వెల్లడైంది.

అలాగే చలి కారణంగా చాలామంది వ్యాయామం, డైట్ లను నిర్లక్ష్యం చేస్తుంటారు.దీంతో శరీర బరువు అదుపు తప్పుతుంటుంది.అయితే వెయిట్ గెయిన్ అవ్వ‌డం మధుమేహలకు ఏమాత్రం మంచిది కాదు.ఈ సమస్యకు చెక్ పెట్టడంలో పిస్తా పప్పు గ్రేట్ గా సహాయపడుతుంది.

రోజుకు గుప్పెడు పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.తరచూ ఆకలి వేయకుండా ఉంటుంది.

చిరు తిండ్లపై మనసు మ‌ళ్ల‌కుండా ఉంటుంది.అదే సమయంలో మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది.

ఫలితంగా వెయిట్ గెయిన్ కాదు లాస్ అవుతారు.

Telugu Diabetes, Diabetics, Tips, Latest, Nuts, Pistachios-Telugu Health Tips

అంతేకాదు మధుమేహం ఉన్నవారు ప్రస్తుత చలికాలంలో రోజూ పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల గుండె జ‌బ్బులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రోగ‌నిరోధక వ్యవస్థ బలపడుతుంది.సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

ఎముకలు దృఢంగా మారతాయి.మరియు జీర్ణ వ్యవస్థ పనితీరు సైతం చురుగ్గా పనిచేస్తుంది.

కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రస్తుత చలికాలంలో తప్పకుండా పిస్తా పప్పును డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube