తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభానికి దిగ్విజయ్ సింగ్ చేసిన చికిత్స ఫలించలేదని తెలుస్తోంది.ఇవాళ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సీనియర్లు డుమ్మా కొట్టారు.
డిగ్గీ రాజా హితబోధ చేసినా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ తీరును మార్చుకోలేదు.విభేదాలు పక్కన పెట్టి చేతులు కలపాలని సూచించినా ఫలితం లేదని తెలుస్తోంది.
గాంధీభవన్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.ఈ సందర్భంగా సీనియర్ల తీరుపై ఆయన అసహానం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత సమస్యలు చర్చకు పెట్టవద్దన్నారు.ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని పరోక్షంగా చురకలు అంటించారు.
అయితే ఒకవైపు సీనియర్ల నేతల వివాదం.మరోవైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన కీలక నేతల రాజీనామాల పర్వం నేపథ్యంలో సంక్షోభానికి దారి తీసిన విషయం తెలిసిందే.







