రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రతి గురు, శుక్ర వారాలలో ప్రసారమవుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.
కాగా జబర్దస్త్ షోలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా డబ్బులు మీనింగ్ డైలాగులు కాంట్రవర్సీలో క్రియేట్ చేసే విధంగా డైలాగ్లు ఉంటున్నాయి.ఇకపోతే జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
ఇటీవల కాలంలో మళ్ళీ ఒక్కొక్కరు రీ ఎంట్రీ ఇస్తున్నారు.కాగా జబర్దస్త్ యాంకర్ అనసూయ జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే.
ఆమె స్థానంలో కొద్దిరోజుల పాటు యాంకర్ రష్మీ యాంకరింగ్ చేయగా ఆ తరవాత అనసూయ స్థానాన్ని భర్తీ చేస్తూ జబర్థస్త్ యాంకర్ సౌమ్య రాయ్ ను రంగంలోకి దింపారు.
అయితే సౌమ్య రాయ్ జబర్దస్త్ షో కి వచ్చే కొన్ని నెలలు కూడా పూర్తికాక ముందే అప్పుడే ఆమె జబర్థస్త్ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అనసూయ ఏ కారణంతో జబర్థస్త్ ను వీడిందో సౌమ్య కూడా అదే కారణంతో జబర్థస్త్ నుంచి తప్పుకుంటోందట.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లోని కాంట్రవర్సీయల్ కంటెంట్ వివాదాలకు దారి తీయడంతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.అయితే జబర్దస్త్ షోలో బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా హద్దులు మీరుతుండడంతో ఆమె ఈ షోనుంచి కూడా ఈ షో నుంచి తప్పుకుంది.

ఇదే క్రమంలో కొత్తగా జబర్దస్త్ లోకి యాంకర్ సౌమ్య అడుగు పెట్టింది.అయితే మూడు , నాలుగు ఎపిసోడ్ పద్ధతిగా చేసిన సౌమ్య సైతం హైపర్ ఆది లాంటివాళ్ల డబల్ మీనింగ్ డైలాగ్స్ కి బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఆమెని ఇబ్బంది పెడుతున్నాయట.మరి ముఖ్యంగా హైపర్ ఆది అయితే సౌమ్య విషయంలో మితిమీరి కామెంట్ చేస్తూన్నాడు.దాంతో అనసూయ చెప్పిన విధంగా బాడీ షేమింగ్ కామెంట్స్ నిజమే అని అనుకుంటున్నారు.
అయితే సౌమ్య నిజంగానే జబర్దస్త్ నుంచి తప్పుకుంటోందా? ఆమె పట్ల బాడీ షేవింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయా లేదా అన్నది తెలియాలి అంటే సౌమ్య రావు స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి.








