ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రామాయణం, మహాభారతంలను(Ramayana ,Mahabharata) వెండితెరపై అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.పురాణ ఇతిహాసాలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపించేవారు.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం (Ramayana)తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
నితీష్ తివారీ(Nitish Tiwari) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా సీత పాత్రలో సాయిపల్లవి (Ranbir Kapoor ,Rama, Sai Pallavi ,Sita)నటిస్తున్నారు.ఈ సినిమాలోని రోల్స్ గురించి బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేష్ కన్నా(mukesh Khanna) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ రామాయణ గురించి ఇప్పుడు నేను ఏది మాట్లాడినా నన్ను నిందించడం ప్రారంభిస్తారని తెలిపారు.

ట్రోల్స్ చేస్తారని ఆయన పేర్కొన్నారు.జాకీష్రాఫ్ కుమారుడి(Jackie Shroff) గురించి నేను మాట్లాడితే ఆ కామెంట్స్ ఎంత చర్చనీయాంశంగా మారాయో తెలిసిందేనని ఆయన వెల్లడించారు.నేను నా మనసులో మాటను చెప్పాలని అనుకుంటున్నానని రాముడిగా ఎవరు కనిపించినా రామాయణం సీరియల్ లో రాముడిగా కనిపించిన అరుణ్ గోవిల్(Arun Govil) పోలికలు కనిపించాలని ఆయన చెప్పుకొచ్చారు.

ఆయన ఆ పాత్రకు జీవం పోశారని ముఖేష్ కన్నా వెల్లడించారు.తెరపై రాముడిగా కనిపించే వాళ్లు రావణుడిగా కనిపించకూడదని ఆయన పేర్కొన్నారు.పవిత్రమైన పాత్రలు పోషించే సమయంలో పార్టీలకు వెళ్లి మద్యం తాగడం చేయకూడదని ఆయన వెల్లడించారు.అయినా ఆ పాత్రలో ఎవరు నటించాలో చెప్పే అధికారం నాకు లేదని ముఖేష్ కన్నా అన్నారు.
రాముడిలా ఒదిగిపోతే మాత్రమే పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆయన తెలిపారు.బాలీవుడ్ రామాయణం గురించి కూడా కామెంట్లు చేయడం ద్వారా వేర్వేరు సందర్భాల్లో ముఖేష్ కన్నా వార్తల్లో నిలిచారు.
ఆదిపురుష్ మూవీపై కూడా ముఖేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.