తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి రాజమౌళి గుర్తుకు వస్తాడు.నిజానికి ఆయన ఎంటైర్ కెరీర్ లో చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి.
ఆయన దర్శకత్వంలో చేసిన చాలామంది హీరోలు ఆ తర్వాత కూడా సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతూ స్టార్ హీరోల రేంజ్ ను టచ్ చేశారు.కానీ కొంతమంది మాత్రం స్టార్ హీరోలుగా ఎదగలేకపోయారు.
కారణం ఏదైనా కూడా రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో నటించి సూపర్ సక్సెస్ ని అందుకున్న హీరోలందరు ఇప్పుడు స్టార్ డమ్ ను సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నారు.
మరి ఆయన సినిమాల్లో నటించి స్టార్ హీరోలుగా ఎదగలేకపోయిన ముగ్గురు హీరోలు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం… ముందుగా సై సినిమాతో నితిన్ కి ఒక మంచి విజయాన్ని అందించాడు…ఇక నితిన్ మాత్రం స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.ఇక ఈగ సినిమాతో నాని( Nani ) కూడా ఒక మంచి సక్సెస్ ని అందించినప్పటికి నాని ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతున్నాడు.
మరి ఆయన స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేసే సినిమాలు మాత్రం అతనికి పడడం లేదు.రీసెంట్ గా వరుసగా మూడు సక్సెస్ లతో మంచి విజయాలను అందుకున్న ఆయన ఇకమీదట కూడా అంతకు మించిన సక్సెస్ ను సాధిస్తే స్టార్ హీరో రేంజ్ ను చేరుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మర్యాద రామన్న సినిమాతో సునీల్( Sunil ) హీరోగా మారినప్పటికి ఆయన లాంగ్ రన్ లో మాత్రం హీరోగా కొనసాగలేక పోతున్నాడు.
కారణం ఏదైనా కూడా సునీల్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలబడటమే కాకుండా విలన్ పాత్రను కూడా పోషిస్తూ తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు…
.