వామ్మో, ఈ మహిళ మామూలు దొంగ కాదు.. స్కూటర్‌పై వచ్చి ఏం ఎత్తుకెళ్లిందో చూడండి..

దొంగల యందు ఈ దొంగ వేరయా అని అనుకునే లాగా ఒక మహిళ ఇటీవల దొంగతనానికి పాల్పడింది. సీసీటీవీ కెమెరా(CCTV camera) కంటపడటంతో ఓ మహిళ కుండీలో మొక్కను ఎత్తుకెళ్లిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 Wow, This Woman Is No Ordinary Thief.. Look What She Stole On A Scooter.., Theft-TeluguStop.com

ఓ ఇంటి ముందు నుంచి మొక్కను చాపకింద నీళ్లలా లేపేసి, స్కూటర్‌పై జంప్ (Jump on a scooter)అవడం వీడియోలో స్పష్టంగా రికార్డయింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

X (ట్విట్టర్)లో షేర్ అయిన ఈ వీడియో ఎప్పుడటిదో తెలియదు.నిర్మానుష్యంగా ఉన్న ఓ వీధిలో ఈ సీన్ జరిగింది.స్కూటర్‌పై(Scooter) వచ్చిన ఓ మహిళ ఏదో వెతుకుతున్నట్లు అటూ ఇటూ చూసింది.ఓ ఇంటి ముందు స్కూటర్ ఆపి దిగింది.

చకచకా కుండీలోని మొక్కను చేజిక్కించుకుని, దాని వేర్లు, కొమ్మలు (Roots ,branches)పక్కనున్న మొక్కలకు చిక్కుకుంటే వాటిని విడిపించింది.ఆ తర్వాత కూల్‌గా దాన్ని స్కూటర్‌పై పెట్టుకుంది.

అంతలో ఓ కారు అటుగా వెళ్లినా ఏమాత్రం బెదరకుండా, ఎవరికీ అనుమానం రాకుండా స్కూటర్‌పై అక్కడి నుంచి జంప్ అయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.కొందరైతే ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.“స్కూటర్, పెట్రోల్ కొనే డబ్బులున్న ఆవిడ, ఓ కుండీ కొనలేదా?” అంటూ కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.“ఈ మధ్య ఆడవాళ్లు కుండీలే ఎందుకు ఎత్తుకుపోతున్నారు? వాటితో ఏం చేస్తారు?” అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.ఇంకొందరైతే దీని వెనుక మూఢనమ్మకం ఉండొచ్చని అంటున్నారు.“డబ్బున్న వాళ్ల ఇంట్లో మనీ ప్లాంట్ దొంగిలిస్తే తమకు కూడా కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు” అని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు.

ఈ ఘటన నెల రోజుల క్రితం వైరల్ అయిన ఇలాంటి మరో ఉదంతాన్ని గుర్తు చేస్తోంది.ఆ కేసులో ఒక మహిళ BMW కారులో వచ్చి ఒక ఈవెంట్‌ బయట ఉన్న కుండీలోని మొక్కను దొంగిలించడం కనిపించింది.ఏదేమైనా, ఈ వింత దొంగతనాలు మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి, నవ్వుకి గురి చేస్తున్నాయి.

ఈ ‘కుండీల మిస్టరీ’ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube