టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ సందడి చేసిన వారిలో శర్వానంద్ (Sharwanand) ఒకరు.ఈయన ఎన్నో సినిమాలలో హీరోలకు తమ్ముడి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.
అనంతరం హీరోగా ఈయన కూడా అవకాశాలను అందుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారినా శర్వానంద్ గత కొద్దిరోజులుగా అనుకున్న స్థాయిలో తన సినిమాల ద్వారా సక్సెస్ అందుకోలేకపోతున్నారు.
ఇక ఈయన చివరిగా మనమే అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇక కెరియర్ పరంగా శర్వానంద్(Sharwanand) రెండు సినిమాలకు కమిట్ అయ్యారు.ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ పనులలో ఈయన బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే శర్వానంద్ గత ఏడాది జూలై నెలలో రక్షిత రెడ్డి (Rakshitha Reddy) అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా గత ఏడాది పెళ్లి చేసుకున్న శర్వానంద్ ఈ ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
అయితే ఈయన ఎక్కడ కూడా తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించలేదు కానీ తనకు కూతురు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇక తన కుమార్తెకు లీలాదేవి మైనేని (Leela Devi Mineni) అనే పేరు పెట్టినట్లు కూడా ఈయన తెలిపారు.అయితే తాజాగా సందర్భం ఏంటి అనేది తెలియదు కానీ ఈయన మాత్రం తన కూతురి పేరిట అన్నదానం(Food donation in the name of daughter) చేశారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ టెంపుల్ వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు.
శర్వానంద్ తో పాటు అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులు స్వయంగా భోజనాలు వడ్డించడం విశేషం.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక సినిమాల విషయానికొస్తే శర్వానంద్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలోను అలాగే రామ్ అబ్బ రాజు దర్శకత్వంలో రెండు సినిమాలకు కమిటీ బిజీగా ఉన్నారు.