హిందూ పురాణాల ప్రకారం తమలపాకులకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం జరిగినా లేదా పూజాకార్యక్రమాలు జరిగినా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వాటిలో తమలపాకులు ఒకటి.తులసి ఆకుల తర్వాత ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న వాటిలో తమలపాకులు ప్రథమ స్థానంలో ఉంటాయి.

 Devotional Why Do We Use Tamalapaku In Tambulam, Tamalapaku, Tambulam, Devotiona-TeluguStop.com

అందుకే ప్రతి పూజా కార్యక్రమంలోనూ శుభకార్యాలలోనూ అలాగే మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారికి తాంబూలంగా తమలపాకులను ఇవ్వడం మనం చూస్తుంటాము.అయితే ఎన్నో ఆకులు ఉండగా తమలపాకులకు ఇంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం తమలపాకులకు ఈ ప్రాధాన్యత రావడానికి ఎన్నో కారణాలున్నాయి.రామాయణం ప్రకారం తమలపాకులకు ఎందుకంత ప్రాధాన్యత ఉంది అనే విషయానికి వస్తే… సీతారాములు వనవాసం చేసిన తర్వాత అక్కడ సీత అపహరణకు గురైన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సీత జాడను కనుగొన్న హనుమంతుడు అక్కడ తాను సంతోషంగా ఉండాలని శ్రీరాముడికి చేరవేయడానికి ఏదైనా ఒక వస్తువు ఇవ్వాలని సూచించారు.

ఇలా అశోక వనంలో ఉన్న సీతమ్మ సంతోషంగా ఉన్నానని తెలియజేయడం కోసం అక్కడే ఉన్నటువంటి ఒక తమలపాకును తీసి హనుమంతుడికి ఇచ్చింది.

ఇలా తమలపాకును సీతాదేవి సంతోషానికి సూచికగా ఇవ్వడం వల్ల ప్రతి శుభకార్యంలోనూ, పూజా కార్యక్రమంలోనూ మన సంతోషానికి గుర్తుగా తమలపాకులను తాంబూలంలో కూడా ఇవ్వడం చేస్తున్నారు.అందుకే తమలపాకులకు అంత ప్రాధాన్యత ఉందని రామాయణం తెలియజేస్తోంది.

తమలపాకు సంతోషాన్ని సూచిస్తుంది కనుక తమలపాకులకు అంతటి ప్రాధాన్యత కల్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube