జగన్ పాదయాత్ర చేసినప్పటి నుంచే ప్రతి పేదోటి సొంతింటి కల నెరవేరుస్తానంటూ గొప్పగా ప్రచారం చేశారు.జగన్ ముఖ్యమంత్రి అయిన ఇరవై నెలలకు గాని ఈ విషయం గుర్తుకు రాలేదు.
ఏపీలో కొద్ది రోజుల క్రితమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారు.ఆ ఇళ్ల స్థలాల్లో కొండలు, గుట్టలే ఎక్కువుగా ఉన్నాయన్న విమర్శలూ ఉన్నాయి.
ఇక పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు కొన్ని చోట్ల పంపిణీ చేసిన ప్రభుత్వం వారికి ఇళ్లు నిర్మించుకునే విషయంలో మూడు ఆప్షన్లు ఇచ్చింది.అయితే ఇప్పుడు ఆ ఆప్షన్‌ను వెనక్కు తీసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి.
మేం ఇళ్లు కట్టించి ఇవ్వము మేం రాయితీ మాత్రమే ఇస్తాము లబ్ధిదారులే కట్టుకునే ఆప్షన్‌ను మాత్రమే పెట్టించాలంటూ క్షేత్రస్థాయి గృహనిర్మాణశాఖ యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీచేసింది.దీంతో మా జగనన్నే మాకు ఇంటి స్థలంతో పాటు ఇళ్లు కూడా కట్టించి ఇస్తాడని ఆశపడ్డ పేదలకు గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది.
ఇక వాలంటీర్లు కూడా ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తామన్న ఆప్షన్ వదిలేసి రాయితీ ఇస్తే మేమే ఇళ్లు కట్టుకుంటాం అన్న ఆప్షన్ ఎంపిక చేసుకోవాలని లబ్ధిదారులపై ఒత్తిడి చేసే ప్రక్రియ ప్రారంభించారని తెలుస్తోంది.

గతంలో మాత్రం ప్రభుత్వం లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చింది.ప్రభుత్వ నమూనా ప్రకారం ఇళ్లు కట్టుకునే వారికి ప్రభుత్వమే మెటీరియల్‌తో ఉట కూలీ ఖర్చులు ఇస్తుంది.రెండోది ప్రభుత్వం ఇచ్చే రాయితీతో మెటీరియల్ బయట మార్కెట్లు కొనుక్కుని ఇళ్లు కట్టించుకోవడం.
మూడో ఆప్షన్ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి అప్పగించడం.అయితే పది రోజుల్లోనే ప్రభుత్వం వెనక్కు తగ్గింది.
ఇప్పుడు వాలంటీర్లు ఒత్తిడితో చాలా మంది లబ్ధిదారులు వచ్చిన స్థలాలు వెనక్కి పోతాయన్న భయంతో మేమే కట్టుకుంటామన్న ఆప్షన్ పెట్టుకుంటున్నారు.తాజాగా హౌసింగ్ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు సైతం లబ్ధిదారులే ఇళ్లు కట్టుకునే ఆప్షన్ ప్రోత్సహించమని చెపుతున్నారు.
ఏదేమైనా పేదలతో ప్రభుత్వం ఇలా చెలగాటం ఆడడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలే సర్వత్రా వినిపిస్తున్నాయి.