మహాభారతంలో వచ్చే సంజయుడు ఎవరు ?

సంజయుడు గవాల్గనుడనే సూతుని కుమారుడు.సూతుడు అంటే రథ చోదకుడు అని అర్థం.

 Who Is Sanjayudu In Mahabharatha , Devotional, Drutharashtrudi Ratha Sarathi, Ma-TeluguStop.com

అయితే సంజయుడు సకల సద్గుణ సంపన్నుడు.ఇతని యోగ్యతను వ్యాసుడు, ధృత రాష్ట్రుడు, ధర్మ రాజు మొదలైన వారు చక్కగా గుర్తించినట్లు మహా భారతం చెబుతోంది.

సంజయుడు అనే శబ్దానికి ఇంద్రియాలను చక్కగా జయించిన వాడు అని అర్థం.కౌరవ పక్షం నుండి ధృతరాష్ట్రుని ఆదేశంతో పాండవుల వద్దకు మొదట రాయబారిగా పోయినవాడు సంజయుడే.

ఇతడు అంధుడైన ధృతరాష్ట్రుని వద్ద ఉండి ఆ మహా రాజును తీరు తెన్నులను భగవద్గీతని వినిపించే వాడు.మహా భారత యుద్ధం జరిగిన ఆ రాజుకు వివరించి చెప్పినవాడు ఇతడే.

యుద్ధ భూమిలో ఎక్కడ తిరిగినా ఇతనికి ఏ విధమైన ప్రమాదమూ కలగకుండా ఉండునట్లూ, యోధుల మాటలూ, అభిప్రాయాలూ గోచరించే టట్లు వ్యాస మహర్షి ఇతనికి దివ్య శక్తి ప్రసాదించాడు.అందు వల్లనే ఇతడు ధృతరాష్ట్రునికి యుద్ధ వృత్తాంతాన్ని పూస గుచ్చినట్లు వివరించ గలిగాడు.

పద్దెనిమిదవ రోజు భారత యుద్ధ భూమిలో సాత్యకి ఇతన్ని పట్టుకొని వధించబోయింది.అప్పుడే వ్యాస మహర్షి వచ్చి అతడిని కాపాడాడు.

కుమారుల మరణం తర్వాత గాంధారి, ధృతరాష్ట్రుల వెంట అడవికి వెళ్ళాడు.వారి ఆలనా పాలనా చూసాడు.

అయితే ఒక రోజు అడవిని కార్చిచ్చు కాల్చేస్తున్న సమయంలో గాంధారీ, ధృతరాష్ట్రుని బలవంతంతో ప్రమాదం నుండి తప్పించుకొని వేరే దారిన వెళ్ళి చివరకు హిమాలయాలకు చేరుకున్నాడు.ఇంతటి మహా వ్యక్తే సంజయుడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube