బాలీవుడ్ పై సౌత్ డామినేషన్.. ఈ లిష్టు చూస్తే ఔననక తప్పదు!

మన సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కానీ హీరోలు కానీ ఇంతకు ముందు తక్కువ చేసి చూసే వారు.కానీ ఇప్పుడు అలా కాదు.

 South Movies Domination On Bollywood Rrr Kgf 2 Beast Vikram Details, , South Mov-TeluguStop.com

మన రేంజ్ మారిపోయింది.ఇంతకు ముందులా మన సినిమాలను చిన్న సినిమాలుగా కూడా చూడడం లేదు.

బాహుబలి తో మొదలైన మన సినీ ప్రయాణం అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బాలీవుడ్ నే శాసించే స్థాయికి వచ్చింది.

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఇండియన్ మార్కెట్ మీద మన సౌత్ సినిమాల ప్రభావం ఎక్కువుగా ఉంది అనే చెప్పాలి.పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను పలకరించాయి.అలాగే ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కూడా అందుకున్నాయి.ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులంతా సౌత్ సినిమాల మాయలో పడిపోయారు.పుష్ప నుండి మొదలైన సౌత్ మ్యానియా ఇప్పటికి తగ్గడం లేదు సరికదా రోజు రోజుకూ పెరుగుతుంది.

మరి 2022 లో ఇప్పటి వరకు రిలీజ్ అయినా సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే ఎక్కువ భాగం సౌత్ దే కనిపిస్తుంది.కానీ బాలీవుడ్ సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

రిలీజ్ అయినా అన్ని సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి.తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన జాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం.

ఈ సంస్థ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ 10 సినిమాల లిష్టును రిలీజ్ చేసింది.

Telugu Beast, Bheemla Nayak, Bhool Bhulaya, Bollywood, Gangubai, Kgf Chapter, Ko

కెజిఎఫ్ 2 రూ 872.6 కోట్లు కలెక్ట్ చేసి టాప్ లో నిలిచింది.ఇక ట్రిపుల్ ఆర్ సినిమా 784.2 కోట్లతో రెండవ స్థానం తెచ్చుకుంది.ది కాశ్మీర్ ఫైల్స్ 248.2 కోట్లతో మండవ స్థానం సంపాదించగా.విజయ్ బీస్ట్ సినిమా 139.8 కోట్లు రాబట్టింది.అలాగే విక్రమ్ సినిమా ప్రస్తుతానికి 124.6 కోట్లు రాబట్టి తర్వాత స్థానంలో ఉంది.అలాగే భూల్ భూలయ్య సినిమా 152.8 కోట్లు సాధించింది.

Telugu Beast, Bheemla Nayak, Bhool Bhulaya, Bollywood, Gangubai, Kgf Chapter, Ko

మహేష్ సర్కారు వారి పాట 139.2 కోట్లు రాబట్టగా అలియా గంగూబాయి సినిమా 123.5 కోట్లు వసూలు చేసింది.పవన్ భీమ్లా నాయక్ 114.5 కోట్లు రాబట్టగా.వాలిమై 104.3 కోట్లు రాబట్టి టాప్ 10లో నిలిచింది.ఇలా టాప్ 10 లో 7 సినిమాలు మన సౌత్ వే కావడం విశేషం.దీంతోనే మన సౌత్ సినిమాలు అక్కడ ఇండస్ట్రీపై ఏ విధంగా దండయాత్ర చేసున్నాయో అర్ధం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube