శ్రావణమాసం( Sravanamasam ) పూజలను, శుభకార్యాలను జరుపుకునే పవిత్ర మాసమని పండితులు చెబుతున్నారు.ఈ మాసంలో మహిళలు మంగళ గౌరీవ్రతాన్ని, శివయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
ముఖ్యంగా శివుడు ఈ నెలలో సముద్రంలో పుట్టిన హాలాహలాన్ని మింగి తన కంఠంలో దాచి గరళకంఠుడిగా మారిన నెల అని భక్తులు విశ్వసిస్తారు.కాబట్టి ఈ నెలలో శివునికి( Lord Shiva ) ప్రత్యేక పూజలను చేస్తే అనుగ్రహం లభిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అయితే ఈ మాసంలో శివుడి రుద్రావతారంగా భావించే హనుమంతునీ పూజకు కూడా ఎంతో విశిష్ట స్థానం ఉంది.

హిందూ విశ్వాసం ప్రకారం శ్రావణమాసంలో వచ్చే మంగళవారం రోజున ఎవరైనా శివునితో పాటు హనుమంతుని కూడా పూజిస్తే అతని కోరికలు అన్నీ తీరుతాయని ప్రజలు నమ్ముతారు.శ్రావణమాసంలో మంగళవారాలలో చేసే హనుమంతుడి పూజ( Hanuman Puja ) మతపరమైన ప్రాముఖ్యత, దానికి సంబంధించిన చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పురాణాల ప్రకారం శ్రావణమాసంలో సంకట మోచన హనుమంతుడిని ఆరాధించడం వలన సాధకుల బాధలు దూరమైపోతాయి.
అలాగే శివుడితో పాటు హనుమంతుడి అనుగ్రహం వల్ల జీవితంలో ఎలాంటి భయం ఉండదు.

అలాగే హనుమంతుడు ప్రతి యుగంలో ఉన్నాడు.తన భక్తులను రక్షించడానికి ఒక పిలుపుతో పరిగెత్తుకొని వస్తాడని ప్రజలు నమ్ముతారు.కాబట్టి శ్రావణమాసంలో మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనిషి జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగి కోరికలన్నీ నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు.
అయితే ఈ సంవత్సరం జంట శ్రావణమాసాలు వచ్చాయి.కాబట్టి తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం జులై 18 వ తేదీ మంగళవారం మొదలై ఆగస్టు 16వ తేదీ బుధవారం రోజు ముగుస్తుంది.
అలాగే నిజ శ్రావణమాసం ఆగస్టు 15వ తేదీ గురువారం మొదలై సెప్టెంబర్ 15వ తేదీ శుక్రవారం ముగుస్తుంది.
LATEST NEWS - TELUGU







